వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముండే మృతి: డ్రైవర్ అరెస్ట్, బిజెపి ఆఫీస్‌కు రాహుల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gopinath Munde's death: Driver arrested for collision with car
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే మృతికి సంబంధించిన కేసులో ఓ కారు డ్రైవర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ముండే ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్తుండగా ఆయన కారును మరో కారు ఢీకొనగా.. అతను మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముండే కారును ఢీకొట్టిన కారు డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

కారు డ్రైవర్ గుర్విందర్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేశారు. అతని వయస్సు 32. గుర్విందర్ సింగ్ తన సొంత కారు అయిన టాటా ఇండికాలో వస్తూ... ముండే ప్రయాణిస్తున్న మారుతీ సుజుకి ఎస్ఎక్స్4 వాహనాన్ని ఢీకొట్టారు. డ్రైవర్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. గుర్విందర్ రెడ్ లైట్‌ను లెక్కలోకి తీసుకోకుండా ముందుకు వచ్చాడా అనే విషయమై విచారణ చేస్తున్నామన్నారు.

ముండేకు రాహుల్ నివాళులు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోపినాథ్ ముండే భౌతికకాయానికి కాంగ్రెసు ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ముండే కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముండే భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు రాహుల్ ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయానికి వచ్చారు.

గోపినాథ్ భౌతికకాయానికి బిజెపి నేతలు పలువురు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ బిజెపి నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, ప్రకాశ్ జవదేకర్, రవిశంకర ప్రసాద్, వికె సింగ్, హర్షవర్ధన్, పాశ్వాన్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సిఎం వసుంధర రాజే తదితరులు సందర్శించారు.

English summary

 The driver whose car rammed into Gopinath Munde's car, killing the union minister, has been arrested, police said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X