వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విధుల్లో నిర్లక్ష్యం: గోరఖ్‌పూర్ ఆస్పత్రి ‘హీరో’ డాక్టర్ అరెస్ట్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆసుపత్రిలో గత రెండు నెలల కాలంలో సుమారు 100మంది వరకు చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాధ ఘటన నేపథ్యంలో వేటుకు గురైన డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌న

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆసుపత్రిలో గత రెండు నెలల కాలంలో సుమారు 100మంది వరకు చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాధ ఘటన నేపథ్యంలో వేటుకు గురైన డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

విధుల్లో నిర్లక్ష్యం..

విధుల్లో నిర్లక్ష్యం..

ఆసుపత్రిలోని మెదడువాపు వార్డు అధిపతి అయిన డా. కఫీల్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతుందని ముందుగానే తెలిసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని అతడిపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. డా.కఫీల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దీంతో యూపీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది కఫీల్‌ను శనివారం అరెస్టు చేశారు.

వరుస మరణాలు..

వరుస మరణాలు..

బీఆర్‌డీ ఆసుపత్రిలో 15 రోజుల్లో 70 మంది చిన్నారులు మృతిచెందిన ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మెదడువాపు వార్డులో ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోవడంతో అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 10వ తేదీ నుంచి ఆ వార్డులో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది.

హీరో అంటూ..

హీరో అంటూ..

అయితే ఆ రోజున డా. కఫీల్‌ తన సొంతడబ్బుతో ఆక్సిజన్‌ సిలిండర్లు తీసుకొచ్చి అందించారని, పిల్లల ప్రాణాలను రక్షించేందుకు ఎంతో తాపత్రయపడ్డారని వార్తలు వచ్చాయి. మీడియా హీరోగా అతడ్ని అభివర్ణించించిం. కాగా, ఈ ఘటన అనంతరం డా. కఫీల్‌ను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది.

తెలిసినా స్పందించలేదు..

తెలిసినా స్పందించలేదు..

డబ్బులు చెల్లించాలని లేదంటే ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేస్తామని సదరు పంపిణీదారు ముందుగానే లేఖ రాసినా.. డా. కఫీల్ తగిన చర్యలు తీసుకోలేదని అతడిపై కేసు నమోదైంది. దీంతో శనివారం కఫీల్‌ను అరెస్టు చేశారు. ఆస్పత్రిలో చిన్నారుల వరుస మరణాల నేపథ్యంలో ఇప్పటికే బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ రాజీవ్‌ మిశ్రా, ఆయన భార్య పూర్ణిమాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

English summary
Dr Kafeel Khan accused of negligence in Gorakhpur's BRD hospital tragedy has been arrested by the Uttar Pradesh Special Task Force. Dr Khan who was hailed as a hero, in the beginning, was soon accused of stealing oxygen cylinders from the hospital leading to the death of infants at Gorakhpur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X