వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంత వైద్యం తెచ్చిన చేటు: యూట్యూబ్ చూస్తూ డెలివరీ.... ఏమైందో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

గోరఖ్‌పూర్ : టెక్నాలజీ మనుషులకు ఎంతగా మేలు చేస్తుందో అంతే కీడు కూడా చేస్తుంది. ఒకరిపై ఆధారపడకుండా సొంత పనులు చేయాలనుకుంటాం. ఒకరిపై ఆధారపడుకుండా కొన్ని పనులే సాధ్యమవుతాయి కానీ అన్ని పనులు సాధ్యం కావనేది చాలామంది తెలుసుకోరు. ఇలా ఒక్కరే ప్రయత్నం చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. ఇలాంటి ఘటనే గోరఖ్‌పూర్‌లో జరిగింది. ఇంతకీ ఆ ఘటన ఏంటి... టెక్నాలజీ ప్రాణాలను ఎలా తీసింది... ?

యూట్యూబ్ చూస్తూ బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రయత్నం

యూట్యూబ్ చూస్తూ బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రయత్నం

గోరఖ్‌పూర్‌లో ఘోరం జరిగింది. సొంతంగా డెలివరీకి ప్రయత్నించిన ఓ పెళ్లికాని యువతి ఆమె ప్రాణాలు తీసుకుంది. అంతేకాదు ఈ ప్రయత్నంలో బిడ్డ ప్రాణాలు కూడా పోయాయి. ఇక నిండు గర్భిణీగా ఉన్న ఆమె పురిటి నొప్పులు రావడంతో సొంత వైద్యానికి దిగింది. డెలివరీ కోసం డాక్టరును సంప్రదించకుండా ప్రముఖ సోషల్ మీడియా యూట్యూబ్‌ను ఆశ్రయించింది. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిస్తుందనే విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని భావించిన యువతి తన డెలివరీ కోసం యూట్యూబ్‌ను ఆశ్రయించింది. యూట్యూబ్ చూస్తూ బిడ్డకు జన్మనివ్వాలని భావించింది. ఇక్కడే ఆమె పెద్ద పొరపాటు చేసింది. ఎవరి సహాయం లేకుండా బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది.

ఇంట్లో నుంచి రక్తం బయటకు రావడంతో అనుమానం

ఇంట్లో నుంచి రక్తం బయటకు రావడంతో అనుమానం

ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే సోమవారం రోజున ఆ యువతి గది నుండి పొరిగింటి వారు రక్తం బయటకు రావడం గమినించి ఆ ఇంటి యజమానికి సమాచారం చేరవేశారు. ఇంటికి చేరుకున్న యజమాని తలుపులు కొట్టి లోపలికి ప్రవేశించాడు. అప్పటికే తల్లీ బిడ్డలు ఇద్దరూ మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. అయితే పక్కనే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను పరిశీలించగా అందులో ఆ యువతి బిడ్డకు జన్మనివ్వడం ఎలా అనే వీడియోను యూట్యూబ్‌లో చూసినట్లు పోలీసులు తెలిపారు. తల్లి మృతదేహం వద్ద కత్తెర, బ్లేడు, దారం కూడా పడి ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

తస్మాత్ జాగ్రత్త: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత వ్యక్తి మృతి... వైద్యం ఎందుకు వికటించింది..?తస్మాత్ జాగ్రత్త: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత వ్యక్తి మృతి... వైద్యం ఎందుకు వికటించింది..?

మృతి చెందడానికి నాలుగు రోజుల ముందే అద్దెకు ఇల్లు

మృతి చెందడానికి నాలుగు రోజుల ముందే అద్దెకు ఇల్లు

ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితమే ఆ యువతి ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి గురించి వాకాబు చేసి ఆమె బంధువులకు తెలపగా ఆమెకు ఇంకా వివాహం కాలేదని వారు చెప్పారు. ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితమే ఇల్లు అద్దెకు తీసుకున్న యువతి.... తన డెలివరీకి తన తల్లి వస్తుందని చెప్పినట్లు ఇంటి యజమాని తెలిపారు. ఆధార్ నెంబరు ఇతర వివరాలు తీసుకున్న తర్వాతే ఆమెకు ఇల్లును అద్దెకు ఇచ్చినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే గోరఖ్‌పూర్‌లో యువతి ఇల్లు అద్దెకు ఎందుకు తీసుకుందో పోలీసులకు అంతుచిక్కడం లేదు.

English summary
A 26-year-old unmarried full-term pregnant woman attempted self-delivery at her rented accommodation here while watching a child delivery video on YouTube. Both, the woman and her child, a boy, died in the process, police said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X