చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళ అలా వెళ్లాల్సిందే: నటి గౌతమి, దీపా ప్రతిస్పందన ఇదీ..

శశికళ అటు నుంచే జైలుకు వెళ్లాలని సినీ నటి గౌతమి అన్నారు. జయలలిత కోరుకున్న వ్యక్తే సిఎం కావాలని దీపా జయకుమార్ అన్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సినీ నటి గౌతమితో పాటు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై గౌతమి హర్షం వ్యక్తం చేచచశారు. శశికళ కువతూర్ నుచి నేరుగా బెంగళూరులోని అగ్రహార జైలుకు వెళ్లక తప్పదని ఆమె అన్నారు. జయలలిత నివాసం పోయెస్ గార్డెన్‌లో గల వేద నిలయానికి వెళ్లే నైతిక అర్హత శశికళకు లేదని ఆమె ట్వీట్ చేశారు.

శశికళపై కోర్టు తీర్పును స్వాగతిస్తూ గౌతమి ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను వెల్లడించారు. అవినీతి కేసులో శశికళను దోషిగా నిర్ధారించినట్లు చెబుతూ ఆమ్మ మృతిపై ఆమె సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రెండు కేసులను వేర్వేరుగా పరిగణించాలని ఆమె అభిప్రాయపడ్డారు.

Goutami invites SC verdict on Sasikala

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పను జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ స్వాగతించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చిందని కొనియాడారు. అన్నాడియంకెకు సారథ్యం వహించే నాయకుడు శశికళ చేతిలో కీలుబొమ్మ కారాదని ఆమె ఆకాంక్షించారు.

జయలలిత కోరుకున్న వ్యక్తే ముఖ్యమంత్రి కావాలని ఆమె అన్నారు. తమిళనాడు ప్రజలకు నాయకత్వం వహించే హక్కు శశికళకు, ఆమె కుటుంబ సభ్యులకు లేదని అన్నారు. జయలలిత తన జీవితంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదని, దేన్నీ కాంక్షించలేదని చెప్పారు. ప్రజాసేవకే అంకితం కావాలని అమ్మ కోరుకున్నట్లు ఆమె తెలిపారు.

English summary
Actress Goutami invited Supreme court verdict on Sasikala's DA case. Jayalalithaa's nephew Deepa Jayakumar also reacted on SC judgement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X