జయ సాధారణ వ్యక్తి కారు కాబట్టే..: మరోసారి గౌతమి
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత విషయంపై సినీ నటి గౌతమి మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. జయలలిత సాధారణ వ్యక్తి కారని, ఆమె ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టే తాను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశానని గౌతమి అన్నారు. అపోలో ఆస్పత్రిలో న్న 75 రోజుల పాటు జయలలిత చుట్టూ ఏం జరిగిందని మాత్రమే తాను అడుగుతున్నానని ఆమె చెప్పారు.
Also See : జయలలిత మృతిపై మోడీకి గౌతమి రాసిన లేఖ పూర్తి పాఠం
జయలలితకు సంబంధించిన నిర్ణయాలు ఎవరు తీసుకున్నారని తాను అడుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రికి ఏం జరిగిందని తాను అడిగానని అన్నారు. ఓ సాధారణ పౌరురాలిగా ఆ ప్రశ్న వేస్తున్నట్లు తెలిపారు. జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో అంత రహస్యం ఎందుకు పాటించారని కూడా తాను అడుగుతున్నట్లు గౌతమి చెప్పారు.
Also See :చక్రం తిప్పుతున్న బిజెపి: గౌతమి ప్రకటన, శేఖర్ రెడ్డి ఇంటిపై దాడులు

తాను ఎవరినీ తప్పు పట్టడం లేదని, జయలలితకు అందించిన చికిత్సపై కూడా తాను సందేహాలు వ్యక్తం చేయడం లేదని, కానీ ఆమె చుట్టూ ఏం జరిగిందనే విషయాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నానని గౌతమి అన్నారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్న కాలంలో రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు ఎవరు తీసుకున్నారని అడిగారు.
జయ మృతిపై అనుమానాలు: మోడీకి గౌతమి లేఖ
జయలలిత సాధారణ పౌరురాలు కారని, ఆమెకు చికిత్స జరిగిన కాలంలో ఏం జరిగిందనేది ప్రజలకు తెలియాల్సిన అవసరరం ఉందని అన్నారు. జయలలిత విషయంపై ప్రశ్నలు సంధిస్తూ గౌతమి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.