వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఆన్ లైన్లో రెండున్నర లక్షలు దాటితే టాక్స్, వడ్డీరేట్ల తగ్గింపు

పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించేవారిపై ఆదాయపు పన్నుశాఖ ఓ కన్నేసింది.ఆన్ లైన్ లో పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించేవారు ఇక జాగ్రత్తలు తీసుకోకపోతే ఆదాయపు పన్నుశాఖ నుండి తప్పించుకోలేరు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించేవారిపై ఆదాయపు పన్నుశాఖ ఓ కన్నేసింది.ఆన్ లైన్ లో పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించేవారు ఇక జాగ్రత్తలు తీసుకోకపోతే ఆదాయపు పన్నుశాఖ నుండి తప్పించుకోలేరు.

నల్లదనాన్ని నిర్మూలించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడాది నవంబర్ మాసంలో పెద్ద నగదు నోట్లను రద్దుచేసింది కేంద్రం.

అయితే నల్లదనం నిర్మూలన తర్వాత లెక్కలు చూపని ఆదాయం ఎవరివద్ద ఎంత ఉందనే విషయాలపై ఆదాయపు పన్నుశాఖ ఆరా తీసింది.అయితే మార్చి 31వ, తేది వరకు లెక్కలు చూపని ఆదాయాన్ని పిఎంజెకెవై స్కీం కింద నమోదు చేసుకోవాలని సూచించింది.

ఆదాయపు పన్ను శాఖకు తమ వివరాలను ఇవ్వని వారిపై కొరడా ఝళిపించనుంది కేంద్రం.అంతేకాదు ఇక నగదు లావాదేవీలన్నీ కూడ బ్యాంకుల ద్వారానే జరిగేలా సర్కార్ చర్యలను తీసుకొంటుంది.తద్వారా పన్ను చెల్లించకుండా తప్పించుకొనే అవకాశాలు లేకుండా చేయనుంది సర్కార్.

ఆన్ లైన్ లో ఎక్కువ నగదు లావాదేవీలు నిర్వహిస్తే ఇక అంతే

ఆన్ లైన్ లో ఎక్కువ నగదు లావాదేవీలు నిర్వహిస్తే ఇక అంతే

ఆన్ లైస్ ద్వారా 2.5 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే ఆ ఖాతాలపై ఆదాయపు పన్నుశాఖ పన్ను వేయనుంది. రెండున్నర లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని ఆన్ లైన్ లో ఇంతకు ముందు లావాదేవీలు చేసినా నష్టం లేకుండాపోయింది.అయితే ఆదాయపు పన్నుశాఖ ప్రతి ఖాతాపై నిఘాను వేసింది.పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తే పన్ను బాదుడు తప్పదు.కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతాలు, జన్ ధన్ ఖాతాల నుండి ఒకవేళ పెద్దమొత్తంలో డబ్బులు ఎలక్ట్రానిక్ పద్దతిలో ఒకరి నుండి మరోకరికి బదిలీ అయిన ఖాతాలపై కూడ ఆదాయపు పన్నుశాఖ కేంద్రీకరిస్తోంది.

భారీ నగదు ఉన్న ఖాతాలపై వివరణ కోరనున్న ఐటిశాఖ

భారీ నగదు ఉన్న ఖాతాలపై వివరణ కోరనున్న ఐటిశాఖ

ప్రధానమంత్రి జన్ ధన యోజన కింద పెద్దమొత్తంలో ఖాతాలు తెరిచారు.అయితే నల్లధనాన్ని మార్చుకొనేందుకు దేశవ్యాప్తంగా చాలా మంది ఈ ఖాతాలను ఉపయోగించుకొన్నారనే ఆరోపణలు వచ్చాయి.కొన్ని ప్రాంతాల్లో పెద్ద నగదు నోట్ల తర్వాత ఈ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు జమ కావడం కూడ అనుమానాలకు తావిస్తోంది.అలాంటి ఖాతాలను వివరణ కోరనుంది ఆదాయపు పన్ను శాఖ.

అక్రమార్కులపై కొరడా

అక్రమార్కులపై కొరడా

అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని ఆదాయపు పన్నుశాఖ హెచ్చరిస్తోంది. అక్రమాలు బయటపడితే కఠిన చర్యలు తీసుకొంటామని ఆదాయపు పన్నుశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో నిజాయితీపరులు మాత్రం ఈ విషయాలపై ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఆదాయపు పన్నుశాఖ అధికారులు చెప్పారు.

చిన్న పొదుపుదారులకు తీరని నిరాశ

చిన్న పొదుపుదారులకు తీరని నిరాశ

కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపుదారులకు తీరని నిరాశను మిగిల్చింది. చిన్నమొత్తాల్లో పొదుపుచేసుకొనే పీపీఎఫ్ , ఇతర చిన్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేటులో కోత పెట్టింది. పీపీఎఫ్ సహా చిన్న పొదుపు ఖాతాలపై 0.1 శాతం వడ్డీరేటును తగ్గిస్తూ ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రకటన చేసింది. ప్రస్తుత వడ్డీరేటు 8 శాతం నుండి 7.9శాతంగా మారనుంది. పీపీఎప్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ది యోజన స్కీం, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులపై దీని ప్రభావం పడనుంది.

నాలుగో త్రైమాసికంలో వడ్డీ రేట్ల తగ్గింపు

నాలుగో త్రైమాసికంలో వడ్డీ రేట్ల తగ్గింపు

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానున్న 2016-17 నాలుగో త్రైమాసికంలో ఈ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.ఏప్రిల్ నుండి ఈ ఆదేవాలు అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది. దీంతో చిన్నమొత్తాల్లో పొదుపు చేసుకొనే ఖాతాదారుల నడ్డి విరిచింది.

సేవింగ్స్ ఖాతాల నిల్వలలపై కూడ వడ్డీరేట్ల తగ్గే అవకాశం

సేవింగ్స్ ఖాతాల నిల్వలలపై కూడ వడ్డీరేట్ల తగ్గే అవకాశం

ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం కారణంగా దేశీయ బ్యాంకులు, పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లలో కోత పెట్టే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి, రుణాల జారీ వృధ్ధి మందగించడంతో బ్యాంకులు తమ నిర్వహణ లాభాలను పెంచుకొనేందుకు సేవింగ్స్ ఖాతాల నిల్వలపై వడ్డీరేట్ల కోత తప్పదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

English summary
huge online transactions also affect on account holders.income tax department concertrate on online trasactions.governament slashes small saving schemes interest rates by 0.1%.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X