వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యక్షమైన మంచులింగం.. పూజలు చేసిన గవర్నర్

|
Google Oneindia TeluguNews

సోమవారం ఉదయం ప్రారంభమైన అమర్ నాథ్ యాత్రలో భాగంగా జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పవిత్ర గర్భగుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మంచు లింగాన్ని దర్శించుకున్నారు.. 46 రోజుల పాటు సాగనున్న యాత్ర నేడు ప్రారంభం కావడంతో , ప్రారోంభత్సవం సంధర్భంగా చేపట్టిన మొదటి పూజా కార్యక్రమంలో గవర్నర్ పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. .ఈనేపథ్యంలోనే అమర్‌నాథ్ యాత్ర ప్రశాంతంగా జరగాలని ఆయన కోరుకున్నారు.. యాత్రపై రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన యాత్రికులకు ప్రత్యేక శుభాకాంక్షాలు తెలిపారు.

అమర్‌నాథ్ యాత్రకు, దేశవ్యాప్తంగా లక్షన్నర మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. నేడు ప్రారంభమైన యాత్రలో భాగంగా మొదటి విడతగా ల్తాల్ బేస్ క్యాంప్ నుండి 1617 మంది బయలుదేరగా అందులో 1174మంది పురుషులు, 379 మహిళలు ,15 పిల్లలు,కాగా 49 మంది మత పెద్దలు ఉన్నారు..కాగా పహెలాగాం నుండి మరో 2800 మంది యాత్రికులు బయలు దేరారు.

governer sataya pal malik prayed at the sanctum sanctourm of the holi shrine

నేడు ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. అమర్‌నాథ్‌ యాత్రకు ప్రభుత్వం పటిష్ట భద్రత కల్పించింది.భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంఛార్జిగా వ్యవహరించనున్నారు. ఇక భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా కొద్ది రోజుల క్రితమ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

English summary
governer sataya pal malik prayed at the sanctum sanctourm of the holi shrine to mark the begininning of the annual amarnath yatra on monady. he also participated in the pratham pooja ceremony
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X