వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం - ధరల పెరుగుదల, కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరగడం, చాలా చోట్ల కొరత నెలకొనడం, నాణ్యతలేని ఉల్లిని కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని 'డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ)' విభాగం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Recommended Video

Onion Exports బ్యాన్ : ఉల్లి ఎగుమతులపై నిషేధం | ధరల పెరుగుదల, కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం !

చైనా టెన్షన్: కేంద్రం తొలి అధికారిక స్పందన - ఉభయసభల్లో సుమోటోగా రాజ్‌నాథ్ - డ్రాగన్ నిఘాపై ఇలా..చైనా టెన్షన్: కేంద్రం తొలి అధికారిక స్పందన - ఉభయసభల్లో సుమోటోగా రాజ్‌నాథ్ - డ్రాగన్ నిఘాపై ఇలా..

ఉల్లి ఎగుమతులపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు వెలువడే దాకా ఎగుమతులు నిలిపివేయాలని డీజీఎఫ్‌టీ ఉత్తర్వుల్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణం కంటే 25 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో సున్నితమైన ఉల్లి పంటపై ప్రతికూల ప్రభావం పడిందని, పంటలు పాడైపోవడం, నిల్వ ఉంచిన సరుకు దెబ్బతినడంతో ఉల్లి కొరత కొరత ఏర్పడింది. గతేడాది కూడా ఈ సీజన్ లో ఉల్లి కొరత ఏర్పడటం తెలిసిందే. కొరతకు తోడు దళారుల అక్రమ దందాతో ధరలు అమాంతం పెరిగిపోయాయి.

Government bans export of all varieties of onion with immediate effect

దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటికే కిలో ఉల్లిపాయల ధర రూ.40కి చేరింది. తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో ఉల్లి ధరలు ప్రస్తుతానికి కిలో రూ.20కు అటు ఇటుగా ఉన్నప్పటికీ.. కొద్ది రోజుల్లోనే ధరలకు రెక్కలు రావొచ్చనే అంచనాలున్నాయి. కొందరు వ్యాపారులు ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లి నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని కూడా కేంద్రం భావిస్తున్నది. మొత్తంగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకే ఎగుమతులపై నిషేధం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

English summary
The government on Monday banned the export of all varieties of onions with immediate effect, a move aimed at increasing availability and checking price of the commodity in the domestic market. “The export of all varieties of onions... is prohibited with immediate effect,” the Directorate General of Foreign Trade (DGFT) said in a notification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X