వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lady doctor: స్టార్ హోటల్ లో లేడీ డాక్టర్ మీద ప్రభుత్వ డాక్టర్ ?, సార్ కు సినిమా, కరోనా టైమ్ లో !

|
Google Oneindia TeluguNews

చెన్నై: కరోనా వైరస్ సందర్బంగా విశ్రాంతి లేకుండా వైద్యులు ప్రజలకు సేవ చేశారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ డాక్టర్లను శిరసు వంచి నమస్కారం చేశారు. కరోనా వైరస్ మహమ్మారి నుంచి లక్షల మంది వైద్యులు ప్రాణాలకు తెగించి రోగులకు చికిత్స చేశారు. ఎంతో మంది వైద్యులు కూడా కరోనా వైరస్ చికిత్స అందిస్తూ ప్రాణాలు వదిలేశారు. ఇదే సమయంలో కరోనా వైరస్ సోకిన వైద్యులను క్వారంటైన్ కు తరలించి వారికి సాటి వైద్యులు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడారు. ప్రభుత్వ ఖర్చులతో స్టార్ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న లేడీ డాక్టర్ మీద అక్కడే క్వారంటైన్ లో ఉన్న మరో డాక్టర్ కన్ను వేశాడు. అర్దరాత్రి స్టార్ హోటల్ లో ఒంటరిగా ఉన్న లేడీ డాక్టర్ మీద సాటి వైద్యుడు లైంగిక వేధింపులకు గురి చెయ్యడం కలకలం రేపింది. ఇదే కేసులో అరెస్టు అయిన డాక్టర్ కు కోర్టులో చుక్కెదురైయ్యింది.

Illegal affair: పక్కింటోడితో భార్య గర్బవతి అయ్యిందని ?, ఇద్దర్ని నరికి చంపేశాడు, నలుగురి మీద !Illegal affair: పక్కింటోడితో భార్య గర్బవతి అయ్యిందని ?, ఇద్దర్ని నరికి చంపేశాడు, నలుగురి మీద !

 కరోనా చికిత్స చేస్తూ డాక్టర్లు బలి

కరోనా చికిత్స చేస్తూ డాక్టర్లు బలి

కరోనా వైరస్ మహమ్మారి నుంచి లక్షల మంది వైద్యులు ప్రాణాలకు తెగించి రోగులకు చికిత్స చేశారు. ఎంతో మంది వైద్యులు కూడా కరోనా వైరస్ చికిత్స అందిస్తూ ప్రాణాలు వదిలేశారు. ఇదే సమయంలో కరోనా వైరస్ సోకిన వైద్యులను క్వారంటైన్ కు తరలించి వారికి సాటి వైద్యులు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడారు.

 చెన్నై ప్రభుత్వ డాక్టర్లు

చెన్నై ప్రభుత్వ డాక్టర్లు

చెన్నైలో రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు కరోనా సెకండ్ వేవ్ సమయంలో విరామం లేకుండా రోగులకు చికిత్స అందించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించిన వైద్యులు కరోనా వైరస్ బారినపడ్డారు. వైద్యులను రక్షించడానికి సాటి వైద్యులు ఎంతో శ్రమించారు.

 స్టార్ హోటల్ లో క్వారంటైన్

స్టార్ హోటల్ లో క్వారంటైన్

చెన్నైలోని తేనంపేటలోని ఓ ప్రైవేట్ స్టార్ హోటల్ లో కరోనా వైరస్ సోకిన వైద్యులకు క్వారంటైన్ లో చికిత్స అందించారు. తమిళనాడు ప్రభుత్వ ఖర్చులతో స్టార్ హోటల్ లో క్వారంటైన్ ఏర్పాటు చేసి వైద్యులకు చికిత్స అందించారు. ఇదే స్టార్ హోటల్ లో విదేశాల నుంచి వచ్చిన కొందరికి వైద్యులు చికిత్స అందించారు.

 లేడీ డాక్టర్ మీద కన్ను వేసిన ప్రభుత్వ డాక్టర్

లేడీ డాక్టర్ మీద కన్ను వేసిన ప్రభుత్వ డాక్టర్

రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మోహన్ రాజ్ (28) అదే స్టార్ హోటల్ లో ఉన్నాడు. ఆ స్టార్ హోటల్ లో సాటి వైద్యురాలు కూడా ఉంది. స్టార్ హోటల్ లోని రూమ్ లో ఒంటరిగా ఉంటున్న మహిళా డాక్టర్ మీద కామంతో రగిలిపోయిన మోహన్ రాజ్ కన్ను వేశాడు. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని డాక్టర్ మోహన్ రాజ్ ప్రయత్నించాడు.

 కామాంధుడు అరెస్టు

కామాంధుడు అరెస్టు

అక్టోబర్ 18వ తేదీన డాక్టర్ మోహన్ రాజ్ మహిళా డాక్టర్ మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో మహిళా డాక్టర్ కేకలు వేసింది. మహిళా డాక్టర్ తో పాటు స్టార్ హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చెయ్యడంతో డాక్టర్ మోహన్ రాజ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అప్పటి నుంచి డాక్టర్ మోహన్ రాజ్ జైల్లో ఉన్నాడు.

Recommended Video

Omicron Variant : Symptoms & Doctors Opinion || Oneindia Telugu
 డాక్టర్ కు నో బెయిల్

డాక్టర్ కు నో బెయిల్

తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని చెన్నై మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. న్యాయమూర్తి సెల్వకుమార్ బెయిల్ పిటిషన్ ను విచారణ చేశారు .ఇదే సమయంలో డాక్టర్ మోహన్ రాజ్ కు బెయిల్ ఇవ్వరాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవరాజ్ అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో డాక్టర్ మోహన్ రాజ్ కు బెయిల్ ఇవ్వడానికి న్యాయమూర్తి సెల్వకుమార్ నిరాకరించారు.

English summary
Lady doctor: Government doctor who sexually harassed a female doctor at the star hotel, bail dismissed in Cennai Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X