వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాతృభూమిపై అడుగు పెట్టే వీలూ లేదిక: స్వదేశానికి వచ్చే భారతీయులపై నిషేధం..తక్షణమే అమలు.. !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం.. మరింత తీవ్రమైంది. భారతీయ పాస్‌పోర్టులపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. భారతీయ పాస్‌పోర్టు ఉన్న వారెవరూ స్వదేశానికి అడుగు పెట్టలేరు ఇక. ఈ నిషేధం బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుంది. అనంతరం అప్పటి పరిణామాలను బట్టి.. దాన్ని పొడిగించడమో లేదా ఆ నిషేధాన్ని ఎత్తేయడమో చేస్తామని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) అధికారులు వెల్లడించారు.

ఖైదీల నెత్తిన బాంబు: రెండు తెలుగు రాష్ట్రాల్లో కఠిన నిర్ణయాలు అమలు: నేటి నుంచే..!ఖైదీల నెత్తిన బాంబు: రెండు తెలుగు రాష్ట్రాల్లో కఠిన నిర్ణయాలు అమలు: నేటి నుంచే..!

విదేశాల నుంచి వచ్చిన వారిలోనే అధికం..

విదేశాల నుంచి వచ్చిన వారిలోనే అధికం..

మనదేశంలో ఇప్పటిదాకా 132 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో ఎక్కువ శాతం కేసులు.. పొరుగు దేశాలు లేదా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపించిన దేశాల నుంచి వచ్చిన వారిలోనే కనిపించాయి. ఇటలీ, సౌదీ అరేబియా, దుబాయ్, ఇరాన్, యూకే వంటి దేశాల నుంచి స్వదేశానికి వచ్చిన భారతీయులే పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయా లక్షణాలు కనిపించిన వారిలో మెజారిటీ శాతం పాజిటివ్‌గా తేలాయి.

యూరోపియన్ యూనియన్ సహా..

యూరోపియన్ యూనియన్ సహా..

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు తాజా ఆదేశాలను జారీ చేసింది. యూరోపియన్ యూనియన్, యూరోపియన్ యూనియన్ పరిధిలో ఉంటూ భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్యాన్ని కొనసాగించే దేశాల్లో నివసించే భారతీయులు తమ సొంత గడ్డపై కాలు మోపే అవకాశాన్ని కోల్పోయినట్టే.. తాత్కాలికంగా. ఈ యూరోపియన్ యూనియన్ పరిధిలో మొత్తం 27 దేశాలు ఉన్నాయి. స్విట్జర్లాండ్, నార్వే, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాల్లో నివసించే భారత పాస్‌పోర్టుదారులు మనదేశానికి రాకపోకలు సాగించడంపైనా నిషేధాన్ని వర్తింపజేశారు.

Recommended Video

CoronaVirus Latest Updates | Helpline Number | Symptoms & Precautions
 గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారికి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి..

గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారికి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి..

దీనితోపాటు గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే వారికి 14 రోజుల పాటు క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, ఒమన్, కువైట్ నుంచి వచ్చే భారతీయులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని ఆదేశించింది. వారి రాకపోకలపై ఎలాంటి నిషేధం లేనప్పటికీ.. క్వారంటైన్‌ను మాత్రం తప్పనిసరి చేసింది. ఇప్పటికే చైనా, కొరియా, ఇరాన్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీల నుంచి వచ్చే వారికి క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ ఇదివరకే కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా గల్ఫ్ దేశాలను కూడా ఈ జాబితాలోకి చేర్చింది.

English summary
India today further extended its ban on arriving international passengers and said that it would not provide entry to even Indian passport holders residing in the United Kingdom, Turkey and whole of Europe till the end of March. “Travel of passengers from member countries of the European Union, the European free trade association, Turkey and the United Kingdom to India is prohibited with effect from March 18, 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X