వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబరిమల ఆలయ ప్రవేశం: సుప్రీంకోర్టు తీర్పుపై మరింత స్పష్టత కావాలి: కేరళ సీఎం విజయన్

|
Google Oneindia TeluguNews

శబరిమల ఆలయంలోకి మహిళ భక్తుల ప్రవేశంపై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. మహిళ భక్తుల ప్రవేశానికి అనుమతి ఇవ్వొద్దని దాఖలైన పిటిషన్లపై స్టే విధిస్తూ.. పిటిషన్లను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేసింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేత‌త్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు.

సుప్రీకోర్టు తీర్పుపై తమకు మరింత స్పష్టత కావాలని పినరయి విజయన్ అన్నారు. ఆలయంలోని మహిళల ప్రవేశంపై సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన అంశాన్ని నిశీతంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. శబరిమల ఆలయంలోకి మహిళ భక్తుల ప్రవేశంపై 3:2 న్యాయమూర్తులు విభేదించడంతో యధాతధాస్థితిని కొనసాగించారు. ఆయా పిటిషన్లను ఏడుగురు సభ్యుల ధర్మసనానికి బదిలీ చేశారు.

government needs clarity on Supreme Court verdict kerala cm

సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వానికి క్లారిటీ ఉందని.. కానీ తీర్పు పాఠం చదివి అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి శబరిమల ఆలయంలో భక్తుల ప్రవేశం ఉన్న నేపథ్యంలో విజయ్ స్పందించారు. మహిళల ప్రవేశంతోపాటు ముస్లిం, పర్షి మహిళల ప్రవేశంపై కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. శబరిమల ఆలయంలోకి రుతుక్రమం అయ్యే మహిళలప నిషేధం అమల్లో ఉంది. కానీ 2018లో సర్వోన్నత న్యాయస్థానం మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ.. సంచలన తీర్పునిచ్చింది. దీనిని హిందుసంస్థలు, సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పలు పిటిషన్లు దాఖలు కాగా.. గురువారం తీర్పు వెలువరించింది. పిటిషన్లను ఏడుగురు సభ్యుల ధర్మసనానికి బదిలీ చేసింది.

English summary
Rafale Deal Review Petition Verdict Live Updates: kerala CM Pinarayi Vijayan said state government will need more clarity on the Supreme Court judgment on the entry of women at Sabarimala temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X