వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులా..! మ‌జాకా..! మూడు నెల‌ల పాటు అక్క‌డ పెళ్లిళ్లు ర‌ద్దు..!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : ఆ రాష్ట్రంలో ప్ర‌భుత్వం విచిత్రమైన జీవో తీసుకొచ్చింది. భ‌క్తి కార్య‌క్ర‌మాలు మెండుగా ఉన్నాయ‌ని, వాటికి పెళ్లిళ్ల సీజ‌న్ ఆటంకం కాకూడ‌ద‌ని ఏకంగా పెళ్లిళ్ల‌నే ర‌ద్దు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం హుకుం జారీ చేసింది. దీంతో ముహూర్తాలు పెట్టుకున్న కొత్త జంట‌లు, ఇక పెళ్లి చేసుకుని స్థిర‌పడుదాం అనుకుంటున్న ప్రేమ జంట‌ల‌కు షాక్ త‌గిలినంత ప‌నైంది. ఎప్ప‌టినుంచో ఎదురు చూస్తేన్న పెళ్లి గ‌డియ‌లు రానే ఇవ‌చ్చాయ‌ని ఎదురు చూస్తున్న పెళ్లికాని ప్ర‌సాదుల‌కు మాత్రం ప్ర‌భుత్వ నిర్ణ‌యం మాత్రం నుదిటి మీద పెళ్లి రాత‌ను లేకుండా చేస్తోంది. ఇంత‌కి పెళ్లిళ్ల ర‌ద్దు ఏ రాష్ట్రంలో..? ఎందుకు..? తెలుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

యూపిలో కుంభ‌మేళా..! పోటెత్త‌నున్న భ‌క్తులు..!!

యూపిలో కుంభ‌మేళా..! పోటెత్త‌నున్న భ‌క్తులు..!!

భార‌తీయుల‌కు భ‌క్తి ఎక్కువ‌. జాత‌ర‌ల‌కు, పుష్క‌రాల‌కు దేశం న‌లుమూల‌నుండి భ‌క్తులు క‌దులుతుంటారు. వేల కిలోమీట‌ర్లు లెక్క చేయ‌కుండా ప్ర‌యాణించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో జ‌రిగే కుంభ‌మేళాకు ఉన్న ప్ర‌త్యేక‌త గురించి చెప్ప‌న‌క్క‌ర‌లేదు. కుంభమేళాకు వెళ్లే భక్తులు బస చేసేందుకు సాధారణంగా ఏ లాడ్జిలోనో, హోటల్‌లోనో రూమ్‌లు బుక్ చేసుకుంటారు.

డబ్బున్నవారైతే ఏ ఫైవ్‌స్టార్ హోటల్‌లో గదులను బుక్ చేస్తారు. భక్తులు, సందర్శకుల కోసం యూపీ లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యాధునిక సౌకర్యాలు, మౌళిక వసతులతో కూడిన టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. టెంట్ సిటీలో మొత్తం 4వేల అత్యాధునిక టెంట్లు, సూట్లు అందుబాటులో ఉంచామ‌ని, టెంట్ సిటీలో పైవ్ స్టార్ హోటల్‌లో ఉండే సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయ‌ని.

టెంట్ సిటీలో రూంలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రయాగ్‌రాజ్ కమిషనర్ ఆశిష్ గోయెల్ తెలిపారు. క‌థ ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా అస‌లు ట్విస్టు ఇక్క‌డే మొద‌లౌతోంది. జనవరి 15 2019 నుంచి ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళా ప్రారంభం కానున్న సంద‌ర్బంగా అక్క‌డి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం తీసుకుంది.

ఆద్యాత్మికం త‌ప్ప మ‌రో వాతావర‌ణం ఉండొంద్దు..! అందుకే ప్ర‌భుత్వం ఆ నిర్ణ‌యం..!!

ఆద్యాత్మికం త‌ప్ప మ‌రో వాతావర‌ణం ఉండొంద్దు..! అందుకే ప్ర‌భుత్వం ఆ నిర్ణ‌యం..!!

అయితే, వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి మార్చి వ‌ర‌కు జ‌రిగే పెళ్లిళ్ల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈ మ‌ద్య ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌యాగ్‌రాజ్ సిటీలో ఈ మూడు నెల‌ల పాటు వివాహ వేడుక‌లు ఉండ‌వు. వ‌చ్చే ఏడాది ఆరంభం నుంచి కుంభ‌మేళ‌లో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ మూడు నెల‌ల కాలంలో ప్ర‌యాగ్‌రాజ్‌(అల‌హాబాద్‌)లో ఎటువంటి పెళ్లి వేడుక‌లు పెట్టుకోరాదు అని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. ఒక‌వేళ ఇప్ప‌టికే తేదీల‌ను, మ్యారేజ్ హాళ్ల‌ను ఫిక్స్ చేసుకున్న‌వారు వాటిని ర‌ద్దు చేసుకోవాల‌ని కూడా ఆదేశాలు ఇచ్చారు.

మూడు నెలలు పెళ్లిళ్లు ర‌ద్దు..! కుంభ‌మేళా భ‌క్తుల‌కు ఆటంకం వ‌ద్దు..! సీయం కీల‌క నిర్ణ‌యం..!!

మూడు నెలలు పెళ్లిళ్లు ర‌ద్దు..! కుంభ‌మేళా భ‌క్తుల‌కు ఆటంకం వ‌ద్దు..! సీయం కీల‌క నిర్ణ‌యం..!!

దీంతో ఇప్ప‌టికే ఫంక్ష‌న్ హాళ్ల‌ను బుక్ చేసుకున్న వాళ్లు మ‌రో చోటు వేడుక‌ను నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంద‌రైతే ఉసూరుమంటూ ఈ సీజ‌న్‌లో పెళ్లి తేదీల‌ను ర‌ద్దు చేసుకుంటున్నారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో వెడ్డింగ్ బిజినెస్ కూడా దెబ్బ‌తినే అవ‌కాశాలు ఉన్నాయి. కుంభ‌మేళా స‌మ‌యంలో ప‌విత్ర స్నానాలు ఆచ‌రించే శుభ‌దినాలు పూర్తిగా ముగిసే వ‌ర‌కు ప్ర‌యాగ్‌రాజ్‌లో ఎటువంటి పెళ్లి వేడుక‌లు నిర్వ‌హించ‌రాదు అని ఆదేశాల్లో స్ప‌ష్టంగా పేర్కొన్న‌ది.

జ‌న‌వ‌రిలో మ‌క‌ర సంక్రాంతి, పౌష్ పూర్ణిమ రోజుల్లో, ఫిబ్ర‌వ‌రిలో మౌని అమావాస్య‌, బసంత్ పంచ‌మి, మాగి పూర్ణిమ రోజుల్లో, మార్చిలో మ‌హాశివ‌రాత్రి పూట జ‌రిగే స్నానాల స‌మ‌యంలో భారీ ఎత్తున జ‌నం వ‌స్తార‌ని, కాబ‌ట్టి ఆ రోజుల్లో ఇటువంటి వేడుక‌లు పెట్టుకోరాదు అని ఆదేశించారు.

ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో అవాక్క‌వుతున్న యువ‌త‌..! పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్న జంట‌లు..!!

ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో అవాక్క‌వుతున్న యువ‌త‌..! పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్న జంట‌లు..!!

కుంభ‌మేళాను ద్రుష్టిలో ఉంచుకుని వారణాసి నుంచి ప్రయాగ్ రాజ్ కు ఎయిర్ బోట్ సర్వీసులు అందించాలని కేంద్రం యోచిస్తోంది. కుంభమేళా దృష్ట్యా ఎయిర్ బోట్ సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు రోడ్డు రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రష్యన్ కంపెనీ ఎయిర్ బోట్ సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎయిర్ బోట్ లో ఒకేసారి 16 మంది ప్రయాణికులు వెళ్లొచ్చు.

గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఎయిర్ బోట్ సర్వీస్ వెళ్లనుంది. ప్రయాగ్ రాజ్ ,హల్దియాను అనుసంధానం చేస్తూ వారణాసి వరకు జనవరి 26న ఎయిర్ సర్వీస్ ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నట్లు చెప్పారు. అంతా బాగానే ఉన్న‌ప్ప‌టికి ఈ పెళ్లిళ్ల ర‌ద్దు ఆదేశాలే ఇబ్బందిగా మారిన‌ట్టు కొత్త‌గా పెళ్లి చేప‌సుకోబోయే జంట‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

English summary
In that state the government has brought a strange G.O. The government has issued a g.o. to cancel the marriages of the devotees and not be hindered by their marriage. The new couples who have been put on moods are now shocked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X