వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.3,700 కోట్ల ప్రాజెక్ట్: దేశంలోని 5.5లక్షల గ్రామాలకు వైఫై సౌకర్యం

కేంద్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. రూ.3,700కోట్ల ప్రణాళికతో దేశంలోని సుమారు 5.5లక్షల గ్రామాలకు మార్చి 2019లోపు వైఫై సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. రూ.3,700కోట్ల ప్రణాళికతో దేశంలోని సుమారు 5.5లక్షల గ్రామాలకు మార్చి 2019లోపు వైఫై సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు వివరాలను టెలీకాం శాఖలోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

'2.5లక్షల జీపీ(గ్రామ పంచాయతీ)లకు సెప్టెంబర్‌లోనే టెండర్ వేయాలని నిర్ణయించాం. మార్చి 2019లోపు ఈ జీపీలకు పూర్తిస్థాయి వైఫై సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం' అని టెలీకాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ తెలిపారు.

Government plans WiFi for all panchayats by March 2019 at a cost of Rs 3,700 crore

దేశంలోని అన్ని గ్రామాలకు వైఫై సౌకర్యం కల్పించాలంటే 5.5లక్షల గ్రామాలకు మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ను కల్పించాల్సి ఉంటుందని చెప్పారు. రూ.3,700 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో దీన్ని చేపడుతున్నామని చెప్పారు.

ఈ సంవత్సరాంతానికి లక్ష గ్రామ పంచాయతీల్లో సెకనుకు 1000 మెగాబైట్లతో ప్రభుత్వం బ్రాండ్ బ్యాండ్ సేవలకు శ్రీకారం చుడుతోందని తెలిపారు. భారత్ నెట్ సర్వీస్ ద్వారా వీరికి వైఫై కల్పిస్తామని, ఈ నెట్ వర్క్ పూర్తయిన వెంటనే దేశంలోని అన్ని గ్రామాలకూ వైఫైని అందుబాటులోకి తెస్తామని వివరించారు.

30కోట్ల మంది ప్రజలకు అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ సౌకర్యాన్ని 2022 వరకు 70కోట్ల ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6వరకే 33,430 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభమైందని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు.

English summary
The government is giving shape to an ambitious Rs 3,700-crore plan in an attempt to cover nearly 5.5 lakh villages with WiFi facility by March 2019, a top Department of Telecom official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X