వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: పెట్రోల్ ధరలు తగ్గే ఛాన్స్, కేంద్రం ప్లాన్ ఇదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రో ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోలు ధరలను తగ్గేలా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పెట్రోలు ధరలను తగ్గించే అన్ని రకాల మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. వచ్చే ఏడాది పెట్రోలు ధరలు తగ్గే అవకాశాలున్నాయనే కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

షాక్: భారీగా పెరగనున్న పెట్రోల్, లీటర్‌కు రూ.300, ఎందుకంటే?షాక్: భారీగా పెరగనున్న పెట్రోల్, లీటర్‌కు రూ.300, ఎందుకంటే?

పెట్రోలు ధరలను తగ్గించేందుకు కేంద్రం జీఎస్టీని తీసుకు రావాలనే డిమాండ్ కూడ వస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిపోతున్నాయి.

ఈ ధరల ప్రభావం ఇతర వాటిపై కూడ కన్పిస్తోంది. పెట్రోలియం ఉత్పత్తుల పెరుగుదల ప్రభావం కేంద్ర ప్రభుత్వంపై కూడ చూపుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది.

 పెట్రోలు ధరలు తగ్గించేందుకు కేంద్రం ప్లాన్

పెట్రోలు ధరలు తగ్గించేందుకు కేంద్రం ప్లాన్

పెట్రోలు ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకొస్తోంది. మరికొద్ది రోజుల్లోనే కొత్త ప్రణాళికను అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్‌ను కలపడం ద్వారా ఇంధనం ధరలకు చెక్ పెట్టవచ్చని సర్కారు భావిస్తోంది. తద్వారా ఇంధన ధరలు తగ్గడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెబుతోంది.

 పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటన

పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటన

పెట్రోల్‌లో మిథనాల్‌ను కలుపడం ద్వారా ఇంధన ధరలను తగ్గించవచ్చని కేంద్రం ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ విషయమై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రకటన చేయనున్నట్లు నితిన్ గడ్కరీ వివరించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రకటన చేయనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ఖరీదు దాదాపు 80 రూపాయలుగా ఉంది. ఐతే బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే లీటర్‌ మిథనాల్‌ కేవలం 22 రూపాయలకే లభిస్తుంది. లీటర్‌కు 15 శాతం మిథనాల్‌ను కలిపితే.. పెట్రోల్ ధర కాస్తంత దిగి వచ్చే అవకాశం ఉంది.

 తగ్గనున్న కాలుష్యం

తగ్గనున్న కాలుష్యం

వాయు కాలుష్యాన్ని భారీగా తగ్గించేందుకు మిథనాల్ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని నితిన్ గడ్కరీ చెప్పారు. భారత్‌లోని మెట్రోపాలిటన్ పట్టణాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు మిథనాల్ తో నడిచే బస్సులను తిప్పేందుకు ప్రయత్నిస్తామన్నారు. మిథనాల్‌ను స్థానిక పరిశ్రమల నుంచే ఉత్పత్తి చేయవచ్చనీ గడ్కరీ చెబుతున్నారు. వాటి నుంచి వచ్చే ఇంధనాన్నే ఈ బస్సులకు వాడతామన్నారు.

 2020 నాటికి ఎలక్ట్రిక్ కార్లు

2020 నాటికి ఎలక్ట్రిక్ కార్లు

2020 నుంచి ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. పెట్రోల్ ఉత్పత్తులపై ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్రం ప్రత్యామ్నాయం వైపుకు అడుగులు వేస్తోంది. మరో వైపు బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించాలని భావిస్తోంది.అయితే ప్రభుత్వం అన్నీ అనుకొన్నట్టుగా జరిగితే 2018లో పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Union Roads Minister Nitin Gadkari today said the government will be soon announcing a policy which calls for 15 per cent blending of methanol in petrol to make it cheaper and also reduce pollution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X