వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగైదు రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు, సుస్థిర పాలన అందిస్తాం, సీఎంపీపై కుదిరిన ఏకాభిప్రాయం

|
Google Oneindia TeluguNews

ఉత్కంఠకు తెరపడింది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. వైరిపక్షాలు కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ జట్టుకట్టబోతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీ నేతలతో చర్చలు ముగింపు దశకు చేరుకొన్నాయి. దీంతో వచ్చే నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటవుతుందని శివసేన నేత సంజయ్ రౌత్ స్పష్టంచేశారు.

కుదిరిన ఏకాభిప్రాయం

కుదిరిన ఏకాభిప్రాయం

బుధవారం కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో కనీస ఉమ్మడి ప్రణాళికపై చర్చించారు. దీనిపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. సాధారణంగా రెండు పక్షాల మధ్య అభిప్రాయాలు కుదరడానికి సమయం పడుతుంది.. మూడో పార్టీ చేరినందుక ఇంకాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది అని రౌత్ చెప్పారు. మహారాష్ట్రలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని సంజయ్ రౌత్ చెప్పారు.

శివసేన అభ్యర్థే

శివసేన అభ్యర్థే

మహారాష్ట్ర ప్రజలు శివసేన అభ్యర్థి సీఎం పదవీ చేపట్టాలని కోరుకుంటున్నారని సంజయ్ రౌత్ చెప్పారు. ముందువరసలో ఉద్దవ్ థాకరే పేరు వినిపిస్తోందని చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం.. మంత్రి పదవులు సమానంగా పంచుకుంటాయని తెలియజేశారు.

ప్రెసిడెంట్ రూల్

ప్రెసిడెంట్ రూల్

మహారాష్ట్రలో శివసేన కూటమి ప్రభుత్వం కొలువుదీరనుండటంతో త్వరలోనే రాష్ట్రపతి పాలన తొలగిపోనుందని సంజయ్ రౌత్ చెప్పారు. గత మంగళవారం నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. శివసేన కూటమిలో కనీస ఉమ్మడి ప్రణాళికలో ఏకాభిప్రాయం వచ్చిన సంగతి తెలిసిందే.

ఏం ఉందంటే..

ఏం ఉందంటే..


కనీస ఉమ్మడి ప్రణాళిక రూపొందించే బాధ్యతను జైరాం రమేశ్‌కు అప్పగించినట్టు ప్రచారం జరుగుతుంది. సమావేశంలో కీలక నిర్ణయాలపై తుదిరూపం వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు కాంగ్రెస్-ఎన్సీపీ ఇచ్చిన ప్రధాన హామీల అమలు లక్ష్యంగా ఆయా పార్టీలు కలిసి పనిచేస్తాయి. పంట రుణమాపీ, పంట పెట్టుబడి పథకం తదితర అంశాలపై డిస్కష్ చేస్తారు.

English summary
Senior Shiv Sena leader Sanjay Raut said the government in Maharashtra will be formed in the next four to five days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X