వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీరవ్ మోడీ, మోహుల్ చోక్సీలను ఇండియాకు రప్పిస్తాం: నిర్మలా సీతారామన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితులుగా ఉన్న నీరవ్ మోడీ, మోహుల్ చోక్సీలను భారత్‌కు రప్పిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

గురువారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు. అవినీతి రహిత పాలనను అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Government will bring back Nirav Modi and Mehul Choksi: Nirmala Sitharaman

ఇలాంటి లోపాలు ఉన్న సమయంలో వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన నీరవ్ మోడీ, మోహుల్ చోక్సీలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆమె గుర్తు చేశారు. అయితే వారెంతో దూరం పారిపోలేరని ఆమె అభిప్రాయపడ్డారు. భారత్‌ నుండి వెళ్ళిపోయిన నీరవ్ మోడీ, మోహుల్ చోక్సీలను ఇండియాకు రప్పిస్తామని ఆమె ప్రకటించారు.

దేశంలో మెరుగైన సంస్కరణలను తీసుకొచ్చిన విషయాన్ని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ఈ మేరకు జీఎస్టీని తీసుకొచ్చిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అయితే తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొన్న విషయాన్ని నిర్మలా సీతారామన్ చెప్పారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో నీరవ్ మోడీ పాల్పడిన కుంభకోణం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ అంశం విపక్షాలకు ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు అవకాశాలను కల్పించింది. ఈ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత బ్యాంకులు మోసగాళ్ళకు చెక్ పెట్టేందుకు చర్యలను తీసుకొంటున్నాయి.

English summary
The government will bring back diamantaires Nirav Modi and Mehul Choksi, who triggered the Rs 12,600 crore fraud at state-run Punjab National Bank, defence minister Nirmala Sitharaman said on Thursday and asserted NDA had provided a corruption-free government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X