వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ జాబితా... అమిత్ షా సంచలన ప్రకటన

|
Google Oneindia TeluguNews

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన నిర్ణయం ప్రకటించారు.ఇప్పటికే అసోంలో ఆమలవుతున్న ఎన్ఆర్‌సీ జాబితా తరహాలో దేశ వ్యాప్తంగా పౌరుల జాబితాను రూపోందిస్తామని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. అక్రమ చొరబాటుదారులను గుర్తేంచేందుకు ఎన్ఆర్‌సీ జాబితా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక భారతీయుడు వెళ్లి యుఎస్, యుకె, రష్యాలో చట్టవిరుద్ధంగా జీవించగలరా అంటూ ప్రశ్నించిన ఆయన చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్ లేకుండా ఇతర జాతీయులు భారతదేశంలో ఎలా నివసిస్తారని అన్నారు. అందుకే దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సి) అమలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి వ్యాఖ్యానించారు.

ఆగస్టు 31న ఆస్సాం రాష్ట్రంలో ప్రకటించిన ఎన్ఆర్‌సీ జాబితా ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదని స్ఫష్టం చేసిన అమిత్ షా, ఇది దేశంలో మిగతా రాష్ట్రాలకు కూడ వర్తింపజేస్తామని చెప్పారు.ముఖ్యంగా అసోంలో నిర్వహించిన ఎన్ఆర్‌సీ జాబితాకు కేంద్రహోంశాఖ పూర్తి మద్దతు పలికింది. దీంతో కొద్ది రోజుల క్రితం తుది జాబితాను విడుదల చేశారు. అయితే అసోం విడుదల చేసిన జాబితాలో 19లక్షల పౌరుల పేర్లు గల్లంతయ్యాయి. దీంతో స్థానికంగా ఆందోళన చేలరేగుతోంది.

government will roll out an exercise for a countrywide NRC:Amit Shah

మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌తో పాటు హర్యాణ సీఎం లు ఆయా రాష్ట్రాల్లో ఎన్ఆర్‌సీని రూపోందించాలని భావిస్తున్నారు. జాబితా రూపోందించేందుకు కేంద్రంతో చర్చలు జరుపుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఇక తాజాగా కేంద్రహుంమంత్రి స్వయంగా ఎన్ఆర్‌సీ జాబితాను రూపోందించాలనే అభిప్రాయాన్ని ప్రకటించడంతో ఆయా రాష్ట్రాల్లో కూడ పౌరుల జాబితా రూపోందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Union home minister Amit Shah on Wednesday said that the government will roll out an exercise for a countrywide National Register of Citizens (NRC).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X