వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్ హైటెన్షన్ : రేపు అఖిలపక్ష ప్రతినిధులతో గవర్నర్ భేటీ, హాజరవుతామన్న టీఎంసీ

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాలానా యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి రంగంలోకి దిగారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి .. అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని పార్టీలకు సమాచారం పంపించగా .. అధికార టీఎంసీ కూడా హాజరవుతానని స్పష్టంచేసింది.

చిన్నగా మొదలై ..
సార్వత్రిక ఎన్నికల తర్వాత టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య మొదలైన ఘర్షణ .. కొనసాగుతూనే ఉంది. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత దిగజారకముందే గవర్నర్ రంగంలోకి దిగారు. రేపు సాయంత్రం రాజ్‌భవన్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఈ మేరకు సీపీఎం, కాంగ్రెస్, టీఎంసీ, బీజేపీ పార్టీలకు ఆహ్వానం పంపించారు. ఆల్‌పార్టీ మీటింగ్‌తో నేతల మధ్య ఏకాభిప్రాయం వచ్చి రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి వస్తుందని గవర్నర్ భావిస్తున్నారు. దీంతో శాంతిభద్రతల తిరిగి యాథాతధస్థితికి వస్తాయని భావిస్తున్నారు.

Governor calls all-party meet to resolve differences, TMC agrees to attend

వెల్ కం ..
అఖిలపక్షం సమావేశానికి హాజరవుతామని అధికార టీఎంసీ స్పష్టంచేసింది. తమ పార్టీ ప్రతినిధి హాజరై .. అభిప్రాయం తెలియజేస్తారని గవర్నర్ పంపిన లేఖకు సమాధానం ఇచ్చింది. టీఎంసీ నుంచి పార్థో ఛటర్జీ, బీజేపీ నుంచి దిలీప్ ఘోష్, సీపీఎం నుంచి ఎస్కే మిశ్రా, కాంగ్రెస్ నుంచి ఎస్ ఎన్ మిత్రా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పూర్వపు పరిస్థితి తీసుకొనేందుకు అనుసరించాల్సిన వ్యుహంపై డిస్కస్ చేసి .. ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ తీసుకున్న చొరవను బీజేపీ ప్రతినిధి దిలీప్ గోష్ అభినందంచారు. తమకు గవర్నర్ నుంచి లేఖ అందిందని .. రేపటి సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను చెబుతామని పేర్కొన్నారు.

English summary
after violent clashes between BJP workers and the Kolkata Police were seen on the streets of Kolkata, West Bengal Governor Kesari Nath Tripathi has called for an all-party meeting at Raj Bhawan on wednesday at 4 pm. All major political parties which have representation in the West Bengal assembly including the CPM, Congress, TMC and the BJP have been sent invites. Governor KN Tripathi decided to call for an all-party meeting after the continuation of violence in the West Bengal even after the conclusion of the general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X