వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు చట్టం..మరింత కఠినం: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులకు..అయిదేళ్ల జైలు: ఆర్డినెన్స్

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం.. పోలీసు చట్టాన్ని మరింత కఠినతరంగా మార్చివేసింది..పకడ్బందీ చేసింది. సోషల్ మీడియాను కూడా పోలీసుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. ఇకపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడానికి, పోస్టులను పెట్టడానికి అక్కడ కాలం చెల్లినట్టే. అభ్యంతరకరంగా వ్యాఖ్యలు కనిపిస్తే.. వాటిని పోస్ట్ చేసిన నెటిజన్లకు అయిదేళ్ల కారాగార శిక్షను విధించబోతోంది కేరళ ప్రభుత్వం. ఈ మేరకు పోలీసు చట్టంలో సవరణలను చేసింది. ఈ సవరణలతో కూడిన ఆర్డినెన్స్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆమోదించారు.

కేరళ పోలీస్ చట్టంలోని సెక్షన్ 118 (ఎ) ప్రకారం.. ఏ వ్యక్తి అయినా.. మరొకరిని ఉద్దేశించి సోషల్ మీడియా ద్వారా బెదిరింపులకు లేదా కించపరిచేలా పోస్టులు చేస్తే.. దాన్ని నేరంగా పరిగణిస్తారు. అభ్యంతరకరంగా ఉండేలా వ్యాఖ్యలు లేదా సమాచారాన్ని ఏ సామాజిక మాధ్యమం ద్వారా అయినా ఫలానా వ్యక్తికి పంపించడాన్ని చట్ట వ్యతిరేకమౌతుంది. ఆ పోస్టు తీవ్రతను బట్టి 10 వేల రూపాయల జరినామా లేదా అయిదేళ్ల జైలుశిక్ష. లేదా ఈ రెండింటినీ కలిపి విధిస్తారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననానికి పాల్పడటాన్ని నిరోధించడానికి దీన్ని అమలు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఈ వ్యవహారం విమర్శలకు దారి తీస్తోంది. స్వేచ్ఛను కాలరాసినట్టవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి నెటిజన్లను భయభ్రాంతులకు గురి చేసినట్లుగా భావిస్తున్నారు. దీనిపట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

Governor given approval to a amending the Kerala Police Act, 5 year jail for offensive posts in social media

Recommended Video

#SabarimalaTemple : సరికొత్త నిబంధనలతో.. భక్తుల కోసం తెరుచుకోనున్న Sabarimala ఆలయ తలుపులు!

ఈ వ్యవహారం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు ప్రభుత్వ అంతిమ నిర్ణయం.. ప్రజల గొంతును నొక్కడమేనని విమర్శించారు. ప్రజల తరఫున పోరాడే వామపక్ష నేతలు ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం ఆశ్చర్యకరమని శశిథరూర్ అన్నారు.

English summary
Kerala Governor Arif Mohammad Khan has given his approval to a draconian ordinance by the LDF government amending the Kerala Police Act that provides for jail term for any social media or cyber post that is deemed “offensive” or threatening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X