వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయకాంత్ సహా శశికళకు దూరం: నేటితో సంక్షోభానికి తెర!

తమిళనాట రాజకీయాలు క్షణం క్షణం ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే అధినేత్రి శశికళ మధ్య సీఎం పీఠం కోసం పోరు నడుస్తోంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాట రాజకీయాలు క్షణం క్షణం ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే అధినేత్రి శశికళ మధ్య సీఎం పీఠం కోసం పోరు నడుస్తోంది.

గత నాలుగైదు రోజులుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం నాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు రావడంతో తమిళనాట రాజకీయ సంక్షోభానికి తెరపడుతుందని భావిస్తున్నారు.

<strong>ట్విస్ట్, పన్నీరుకు ఝలక్: స్టాలిన్‌తో టచ్‌లో 15 మంది ఎమ్మెల్యేలు?</strong>ట్విస్ట్, పన్నీరుకు ఝలక్: స్టాలిన్‌తో టచ్‌లో 15 మంది ఎమ్మెల్యేలు?

గవర్నర్‌తో భేటీ అనంతరం పన్నీరు సెల్వం విజయదరహాసం, శశికళ ముఖంలో నిరాశ కనిపించింది. దీనిని చూస్తుంటే ఆయన కూడా పన్నీరుకే మద్దతుగా నిలిచినట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Governor holds talks with Girija Vaidhyanathan

శశికళపై ఉన్న అవినీతి ఆరోపణలు, ఆమెపై, కుటుంబంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను కూడా గవర్నర్ పరిగణనలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి నెలకొన్న పరిణామాలు గమనిస్తే ఈ రోజుతో తమిళ రాజకీయ సంక్షోభానికి తెరపడేట్లు కనిపిస్తోంది.

పన్నీరు సెల్వంకు ఆయన వర్గీయులు సన్మానం చేయడం, గవర్నర్‌తో డీజీపీ సమావేశం కావడం ఇలా కీలక పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. గవర్నర్‌తో డీజీపీ రాజేంద్రన్, చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ తదితరులతో వరుసగా భేటీ అయ్యారు. ఇవి మరింత ఆసక్తిని రేపుతున్నాయి.

<strong>శశికళ 'సీఎం' కాకుండా ఆపండి: హడావుడి ఎందుకని సుప్రీం కోర్టు, చిన్నమ్మకు ఊరట</strong>శశికళ 'సీఎం' కాకుండా ఆపండి: హడావుడి ఎందుకని సుప్రీం కోర్టు, చిన్నమ్మకు ఊరట

గవర్నర్ మరికొద్దిసేపట్లో ప్రకటన చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన ప్రకటన చేస్తే ఆయన ఏం చెబుతారు? ఎవరి వైపు మొగ్గు చూపుతారు? బల పరీక్షకు సిద్ధమవమని ఇరు వర్గాలకు ఆదేశాలు పంపుతారా? లేదా పన్నీరు రాజీనామాపై స్పష్టతనిస్తారా? ఇవేవీ కాకుండా శశికళ విషయంలో కోర్టు తీర్పు వచ్చే వరకూ వేచి చూడాలన్న సందేశాన్ని పంపుతారా? వీటన్నింటికీ అతీతంగా రాష్ట్రపతి పాలనను విధిస్తారా? ఇలా వీటిలో ఏదో ఒక నిర్ణయాన్నైతే గవర్నర్ తప్పనిసరిగా ప్రకటించాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, ఓ వైపు శశికళ ఎమ్మెల్యేలను రిసార్టులో ఉంచగా, కొందరు పన్నీరు వైపు వస్తున్నారు. శశికళ వర్గం మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు జరిపినా.. వారు నో చెబుతున్నారు. తమిళనాడులోని ఏ పార్టీ కూడా ఆమెకు మద్దతివ్వడానికి అనుకూలంగా లేదు.

పార్టీల పెద్దలు బహిరంగంగా చెప్పలేకపోయినా మౌనంగా ఉండిపోవడంతో మద్దతివ్వడానికి వారు సాహసించటం లేదని చిన్నమ్మకు తెలిసిపోయిందంటున్నారు. చివరకు విజయ్ కాంత్, శరత్ కుమార్‌‌లు కూడా హ్యాండిచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీలోని సీనియర్ నటులు, డైరక్టర్లు గురువారం బహిరంగంగానే ఆమెపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డైరెక్టర్, నటుడు రాజేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ.. శశికళ సీఎం అయితే రాష్ట్రాన్నే అమ్మేస్తుందని, రాష్ట్ర ప్రజలను మన్నార్ గుడి మాఫియా బ్లాక్ మెయిల్ చేస్తుందని, అవసరమైతే ప్రధాని మోడీని కూడా బెదిరించడానికి శశికళ వెనుకాడరని సంచనల వ్యాఖ్యలు చేశారు.

English summary
A day after Chief Minister O. Panneerselvam sought time to prove his strength and AIADMK general secretary V K Sasikala sought to form the government claiming support of party MLAs, Governor Ch Vidyasagar Rao held discussions with Chief Secretary Girija Vaidhyanathan, Director-General of Police T K Rajendran and Commissioner of Police S. George at Raj Bhavan on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X