వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు శివాజీ...ఇప్పుడు నేను..అవమానపడ్డాను.. గవర్నర్

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ మధ్య పోలిటికల్ వార్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ కార్యక్రమంలో పాల్గోన్న గవర్నర్ మమతపై ఫైర్ అయ్యారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఖుని అయిందని, దానిపై తాను ఆందోళన వ్యక్తం చేస్తున్నానని అన్నారు. గతంలో తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేశారు. ఈ సంఘటన ద్వార గత చరిత్రలో ఔరంగజేబు రాజ్యానికి వెళ్లి అవమానపడ్డ శివాజీలా తన పరిస్థితి అయిందని అన్నారు.

బెంగాల్‌లో ఆరని రాజకీయ మంటలు

బెంగాల్‌లో ఆరని రాజకీయ మంటలు

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా సర్కార్ మరియు కేంద్రం మధ్యం తీవ్ర అంతర్యుద్దం కొనసాగుతోంది. అధిపత్య పోరులో ఇరు ప్రభుత్వాలు అవకాశం చిక్కినప్పుడల్లా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య పంచాయితీ చివరకు గవర్నర్‌ను సైతం వదిలిపెట్టలేదు. ఈ నేపథ్యంలోనే మమతా సర్కార్ తనను అవమానాలకు గురి చేస్తుందంటూ.. గవర్నర్ వ్యవస్థను చాల తక్కువ స్థాయిలో చూపించేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తుందని గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇలాంటీ పరిస్థితిని తాను ఏనాడు చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.

మమతా ఇంటికి పిలిచి అవమానించారు

మమతా ఇంటికి పిలిచి అవమానించారు

ఈ నేపథ్యంలోనే ఇండియా టుడే కాంక్లేవ్ ఈస్ట్ సదస్సులో పాల్గొన్న గవర్నర్ మరోసారి మమతా సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆక్టోబర్ 11న దుర్గ పూజ సంధర్భంగా తనకు జరిగిన అవమానాన్ని ఆయన తెరపైకి తీసుకువచ్చారు. ముఖ్యంగా 1666లో ఔరంగజేబు తన పుట్టిన రోజు సంధర్బంగా శివాజీని ఆగ్రాకు ఆహ్వానించాడని.. అయితే తన సభలో సైనికాధికారుల వెనక నిలబెట్టి అవమానపర్చాడని తెలిపాడు. ప్రస్తుతం బెంగాల్ ముఖ్యమంత్రి కూడ తనను పూజకు ఇంటికి పిలిచి అవమానించారని గవర్నర్ ఆరోపణలు చేశారు. అయితే తాను మాత్రం ఈ సంఘటనలో మమతా బెనర్జీని మాత్రం ఔరంగజేబుతో పోల్చలేదని వివరించారు.

దుర్గాపూజలో గవర్నర్‌కు అవమానం

దుర్గాపూజలో గవర్నర్‌కు అవమానం

కాగ బెంగాల్‌లో ఇరు పార్టీల మధ్య పోలీటికల్ వార్ కొనసాగుతున్న సంధర్భంలో దసరా సంధర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 11న దుర్గాపూజా పెద్ద ఎత్తున నిర్వహించింది. కాగా ఈ కార్యక్రమానికి గవర్నర్‌ జగదీప్ ధన్‌ఖర్‌కు అహ్వానం రావడంతో ఆయన వెళ్లారు. పెద్ద ఎత్తున కొనసాగిన కార్యక్రమం సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. అయితే గవర్నర్‌కు మాత్రం ఎలాంటీ ప్రయారీటీ ఇవ్వలేదని, కాగా తనను చివరి వరుసలో కూర్చోబెట్టి అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. కనీసం మీడీయాలో నాలుగు సెకన్లు కూడ చూపింలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. అప్పటి నుండి గవర్నర్ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తునే ఉండగా... మమత ప్రభుత్వం సైతం అంతే దూకుడుగా వ్యవహరిస్తోంది.

English summary
Governor Jagdeep Dhankhar feels democracy has broken down in West Bengal under Chief Minister Mamata Banerjee's administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X