వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలనిరూపణకు 15 రోజులా?ఎంఏల్ఏలకు తాయిలాల కోసమా?

ముఖ్యమంత్రి పళని స్వామికి బలనిరూపణ కోసం 15 రోజల పాటు గవర్నర్ సమయం ఇవ్వడం సరైంది కాదని డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి పళని స్వామి బలనిరూపణ చేసుకొంటారనే విశ్వాసం గవర్నర్ క

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామికి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకొనేందుకు గాను 15 రోజల పాటు గడువు ఇవ్వడాన్ని ప్రతిపక్ష డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ తప్పుబట్టారు.

బలనిరూపణకు 15 రోజల సమయం ఇవ్వడం చాల ఎక్కువ సమయం ఇచ్చినట్టేనని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. దీని వల్ల ఎంఏల్ఏలకు తాయిలాలు ఎరవేసి కొనుగోలుచేసేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతోందని ఆయన ఆరోపించారు.

 Governor Should Ensure no 'Horse Trading' by AIADMK: Stalin

ఈ రకమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకుగాను గవర్నర్ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.బలనిరూపణకు 15 రోజల సమయాన్ని గవర్నర్ ఇవ్వడాన్ని చూస్తే ముఖ్యమంత్రి బలాన్ని నిరూపించుకొంటాడనే నమ్మకం గవర్నర్ కూడ లేదని డిఎంకె ఎంపి ఎలంగోవన్ విమర్శించారు..

తమిళనాడులో పదిరోజులుగా నెలకొన్న హైటెన్షన్ రాజకీయ డ్రామాకు తెరదించుతూ మెజారిటీ ఎంఏల్ఏల మద్దతు లేఖలు అందించిన పళని స్వామికి గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వం ఏర్పాటుచేయాలని ఆహ్వనించారు. గురువారం సాయంత్రం పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

English summary
DMK working president M.K. Stalin on Thursday said the 15 days time given to AIADMK's Edappadi K. Palaniswami to prove his majority would result in horse trading and bargaining by legislators.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X