వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశానికి వచ్చేవారు రావొచ్చు! విదేశాలకు వెళ్లొచ్చు, ఒక్క వారు తప్ప!: కేంద్రం కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ రాకపోకలపై విధించిన ఆక్షలను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశంలోకి ఇతర దేశాల నుంచి భారతీయులు, విదేశీయుల రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.

కరోనా వ్యాక్సిన్‌పై అనూహ్య ప్రకటన -ఓట్లేస్తే ఉచితంగా ఇస్తామన్న బీజేపీ -చావు భయాన్ని అమ్ముతున్నారంటూకరోనా వ్యాక్సిన్‌పై అనూహ్య ప్రకటన -ఓట్లేస్తే ఉచితంగా ఇస్తామన్న బీజేపీ -చావు భయాన్ని అమ్ముతున్నారంటూ

పర్యాటక వీసా మినహా అన్ని వర్గాల ప్రయాణాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే, ప్రయాణికులంతా ఆరోగ్య శాఖ సూచించిన ప్రకారం క్వారంటైన్ తదితర కరోనా నిబంధనలను పాటించాల్సి ఉంటుందని పేర్కొంది.

 Govt allows all foreign and Indian nationals to travel to India; all existing visas restored

విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు(ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా), భారతీయ మూలాలున్న వ్యక్తుల(పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఓరిజిన్)తో పాటు విదేశీయులెవరైనా జల, ఆకాశ మార్గాల ద్వారా భారత్‌కు వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వందే భారత్ మిషన్, బబుల్ ఒప్పందం లేదా పౌర విమానయాన శాఖ గుర్తించిన ఏ విమాన సర్వీసుల ద్వారా వచ్చే ఏ ప్రయాణికులనైనా అనుమతిస్తామిన పేర్కొంది. విదేశాలకు వెళ్లే వారు కూడా ఇదే విధంగా వెళ్లవచ్చని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో ప్రస్తుతమున్న వీసాలన్నింటినీ క్రియాశీలం చేస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. ఎలక్ట్రానిక్, పర్యాటక, వైద్య సంబంధ వీసాలు మినహా ఇతర వీసా సేవలన్నింటినీ పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. వైద్య చికిత్స తదితర కారణాల వల్ల భారత్‌కు రావాలనుకునే విదేశీయులు, వారికి సహాయంగా వచ్చేవారు మెడికల్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. ప్రయాణికుల వీసా చెల్లుబాటు తేదీ మించినట్లయితే, కొత్త వీసాలను సంబందించి భారతీయ సంస్థల నుంచి పొందవచ్చని తెలిపింది.

English summary
India on Thursday announced a graded relaxation in visa and travel restrictions and allowed all foreign nationals as well as all OCI and PIO card holders to travel to the country via air or sea. All such persons are now allowed to travel to India for any purpose, except tourism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X