వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వరరావు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ)కు నూతన డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వరరావును కేంద్రం నియమించింది. ఈ మేరకు బుధవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వరరావును నియమిస్తూ కేంద్ర కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపినట్లు నోటిఫికేషన్ వెల్లడించింది.

ప్రస్తుతం కేంద్ర బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఎన్ఎస్ విశ్వనాథన్ స్థానంలో రాజేశ్వరరావు నియామకమయ్యారు. ఆగస్టు 21న ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలను నిర్వహించింది.

 Govt appoints M Rajeshwar Rao as new deputy governor of RBI

కాగా, ప్రస్తుతం రాజేశ్వరరావు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజేశ్వరరావు 1984 నుంచి ఆర్బీఐలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2016లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన రిస్క్ మానిటరింగ్ విభాగానికి బాధ్యత వహించారు.

గతంలో ఆర్బీఐకి చెందిన ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై శాఖల్లో రాజేశ్వరరావు పనిచేశారు. ఇప్పటికే కేంద్ర ఆర్బీఐకి చెందిన మానిటరింగ్ పాలసీ కమిటీలోకి అషిమా గోయెల్, జయంత్ ఆర్ వర్మ, శశాంక బిడేలను నియమిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది.

English summary
The Centre late Wednesday appointed M Rajeshwar Rao as the new deputy governor of the Reserve Bank of India. He is currently an executive director at the banking regulator.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X