వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్, చైనా: జమ్ముకశ్మీర్‌లో రెండు నెల‌ల‌కు స‌రిప‌డా ఎల్‌పీజీ సిలెండ‌ర్ల‌ను సిద్ధం చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం ఎందుకు ఆదేశించింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గ్యాస్ సరఫరా

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు వివాదం నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతం జ‌మ్ముక‌శ్మీర్ పరిపాల‌నా విభాగం జారీచేసిన రెండు ఆదేశాలు పౌరుల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్నాయి.‌

ఒక ఆదేశంలో ఎల్‌పీజీ సిలెండ‌ర్లు స్టాక్ చేసుకోవాల‌ని చ‌మురు సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం సూచించింది. మ‌రోవైపు పాఠ‌శాల భ‌వ‌నాల‌నూ ఖాళీ చేయించాల‌ని ఆదేశాలు జారీచేసింది.

ఈ నిర్ణ‌యాల‌ను జ‌మ్ముక‌శ్మీర్‌లోని రాజ‌కీయ పార్టీలు వ్య‌తిరేకిస్తున్నాయి.

మొద‌టి ఆదేశాన్ని వినియోదారుల వ్య‌వ‌హారాలు, ఆహార స‌ర‌ఫ‌రాల శాఖ జారీచేసింది. రెండు నెల‌ల‌కు సరి‌ప‌డా సిలెండ‌ర్ల‌ను క‌ర్మాగారాలు, గోడౌన్‌ల‌లో నిల్వ చేయాల‌ని చ‌మురు సంస్థ‌ల‌కు దీనిలో సూచించారు.

రెండో ఆదేశాన్ని గందర్‌బ‌ల్ జిల్లా సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ జారీచేశారు. మాధ్య‌మిక‌, ఉన్న‌త పాఠ‌శాల‌లతో స‌హా జిల్లాలోని 16 విద్యా సంస్థ‌ల‌ను ఖాళీ చేయించాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీచేశారు.

అయితే, ఏటా నిర్వ‌హించే అమ‌ర్‌నాథ్ యాత్ర కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు 'బీబీసీ’కి గంద‌ర్‌బ‌ల్ ఎస్ఎస్‌పీ మ‌హ‌మ్మ‌ద్ ఖ‌లీల్ పోస్వాల్ వివ‌రించారు.

యాత్రికుల‌ను సుర‌క్షితంగా ఉంచేందుకు ఇలాంటి ప్రాంతాలు అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

"ఈ ఆదేశాన్ని కేవ‌లం అంత‌ర్గ‌త విధుల్లో భాగంగా జారీచేశారు. అయితే జిల్లా డిప్యూటీ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో ఒక‌రు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌చేసేశారు. ఒక‌వేళ అమ‌ర్‌నాథ్ యాత్ర జ‌రిగితే.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో అలాంటి స‌దుపాయాలు అవ‌స‌రం అవుతాయి. సైనిక అవ‌స‌రాల కోసం రోజూ ఏదో ఒక ఉత్త‌ర్వులు వ‌స్తూనే ఉంటాయి. దీని గురించి ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేదు" అని ఆయ‌న వివ‌రించారు.

"ఏటా ఇలాంటివి జ‌రుగుతూనే ఉంటాయి. ఇదేమీ తొలిసారి కాదు. సైన్యం కోసం స్థలాల‌ను అన్వేషిస్తూనే ఉంటాం. అమ‌ర్‌నాథ్ యాత్ర జ‌రిగేట‌ప్పుడు ఎక్క‌డ చోటు దొరికితే అక్క‌డ సైనికుల‌కు వ‌స‌తి ఏర్పాటు చేస్తాం."

ల‌ద్దాఖ్‌లోని కార్గిల్‌కు గందర్‌బ‌ల్ చాలా స‌మీపంలో ఉంటుంది.

మాధ్య‌మిక‌, ఉన్న‌త పాఠ‌శాల‌లతో స‌హా 16 విద్యా సంస్థ‌ల‌ను ఖాళీ చేయించాల‌ని ఆదేశాలు జారీచేశారు.

సాధార‌ణ ఆదేశాలే

ఇదే విధంగా, తాము జారీచేసిన ఆదేశమూ సాధార‌ణ‌మైన‌దేన‌ని వినియోదారుల వ్య‌వ‌హారాలు, ఆహార స‌ర‌ఫ‌రాల శాఖ డైరె‌క్ట‌ర్ బ‌షీర్ అహ్మ‌ద్ ఖాన్ వివ‌రించారు.

"ఇలాంటి ఆదేశాల్లో అనుమానించ‌డానికి ఏం ఉంటుంది. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అప్పుడ‌ప్పుడు స‌మావేశాలు జ‌రుగుతుంటాయి. ఆ త‌ర్వాత ఇలాంటి ఉత్త‌ర్వులు వ‌స్తుంటాయి. కంపెనీల‌కే ఇలాంటి ఆదేశాలు ఇస్తాం. శ్రీన‌గ‌ర్‌-జ‌మ్మూ నేష‌న‌ల్ హైవేపై శీతాకాలంలో కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతుంటాయి. కానీ ఇప్పుడు వేస‌విలోనూ కొండ చ‌రియ‌లు విరిగిప‌డ‌టం చూస్తున్నాం. అందుకే కిరోసిన్‌, ఎల్‌పీజీ లాంటివి ముందుగానే నిల్వ చేసుకోమ‌ని సూచించాం."

బాలాకోట్ మెరుపుదాడులు, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుకు ముందుకూడా ఇలాంటి ఆదేశాలు జారీ అయ్యాయి. అందుకే జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

అప్పుడు కూడా.. సాధార‌ణంగానే ఇలాంటి దేశాలు జారీ చేస్తామ‌ని, ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేద‌ని ప్ర‌భుత్వం చెప్పుకొచ్చింది. ఎలాంటి వ‌దంతుల‌నూ న‌మ్మొద్ద‌ని అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మలిక్ కూడా చెప్పారు.

బ‌హుశా అందుకేనేమో ఈ సారి రాజ‌కీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ విష‌యంపై త‌మ‌కు స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

"ప్ర‌భుత్వం జారీచేసిన ఆదేశాల‌తో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న పెరుగుతోంది. దుర‌దృష్ట‌వ‌శాత్తు గ‌తేడాది మీరు చెప్పిన అబ‌ద్ధాలు, త‌ప్పుడు హామీల వ‌ల్ల‌.. ఇప్పుడు మీరు వివ‌ర‌ణ ఇచ్చినా ఎవ‌రూ న‌మ్మ‌బోరు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ఈ ఆదేశాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల్సిందే" అని నేష‌న‌ల్ కాన్ఫెరెన్స్ ఉపాధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా ట్వీట్‌చేశారు.

బాలాకోట్ మెరుపుదాడులు, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుకు ముందుకూడా ఇలాంటి ఆదేశాలు జారీ అయ్యాయి.

భ‌యంగుప్పిట్లోప్ర‌జ‌లు

ఇలాంటి ఆదేశాలతో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు పెరిగాయ‌ని మాజీ ఎంఎల్ఏ, సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎంవై తారిగామి వ్యాఖ్యానించారు.

"ఈ ఆదేశాల‌పై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ల‌ద్దాఖ్‌లో భార‌త్‌-చైనాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితుల న‌డుమ ఇలాంటి ఆదేశాలు జారీచేస్తే.. ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గురికావ‌డం సాధార‌ణం. ప్ర‌భుత్వం ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నాం. ఈ స‌మ‌యంలో ఇలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏమిటో కూడా వివ‌రించాలి."

ఇలాంటి స‌మ‌యంలో బాధ్య‌తారాహిత్య‌మైనా ఆదేశాలు జారీ చేయ‌డం శోచ‌నీయ‌మ‌ని జ‌మ్మూక‌శ్మీర్ అప్నీ పార్టీ అధ్య‌క్షుడు స‌య్య‌ద్ ఆల్తాఫ్ బుఖారీ.. బీబీసీతో అన్నారు.

"రెండేళ్లుగా ఇక్క‌డి ప్ర‌జ‌లు నిరాశ‌లో ఉన్నారు. ఇది బాధ్య‌తారాహిత్య‌మైన చ‌ర్య అయినా అయ్యుండొచ్చు. లేదా దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చు. ఆహార స‌ర‌ఫ‌రాల విభాగం డైరెక్ట‌ర్ దీన్ని సాధార‌ణ‌మ‌ని అభివ‌ర్ణించిన‌ట్లు విన్నాను. అయితే ఇలాంటి ఆదేశాల‌తో ప్ర‌జ‌ల‌ను వేధించ‌డం ఎందుకు?"

బుఖారీకి బీజేపీతో ద‌గ్గ‌ర సంబంధాలున్నాయి.

మిలటరీ ట్యాంకర్లు

ఈ ఆదేశాల‌పై జ‌మ్మూక‌శ్మీర్ పీపుల్స్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ ఛైర్మ‌న్ హ‌కీమ్ మ‌హ‌మ్మ‌ద్ యాసీన్ కూడా ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. ప్ర‌భుత్వం చెప్పేదొక‌టి, చేసేదొక‌టి అన్నారాయన.

"ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుకు ముందు ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నారు. మొద‌ట ఏమీ లేద‌ని చెబుతూనే.. త‌ర్వాత నిర్ణయాలు తీసుకుంటారు."

ఈ ఆదేశాల గురించి విన్న‌ప్ప‌టి నుంచీ భ‌యం వేస్తోంద‌ని ద‌క్షిణ క‌శ్మీర్‌కు చెందిన బిలాల్ అహ్మ‌ద్ చెప్పారు.

క‌శ్మీరీల‌ను మ‌ళ్లీ వేధిస్తున్నార‌ని మ‌రో పౌరుడు ఖుర్షిద్ అహ్మ‌ద్ అన్నారు.

"30ఏళ్లుగా ఇలాంటి ప‌రిస్థితులే ఎదుర‌వుతున్నాయి. మేం మాన‌సికంగా చాలా ఒత్తిడికి గుర‌వుతున్నాం. ఓటు బ్యాంకుల కోస‌మే కేంద్ర ప్ర‌భుత్వం ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటోంది. నిన్న‌టి నుంచి ఆదేశాల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మేం మాన‌సికంగా దెబ్బ‌తిన్నాం. గ‌తేడాది ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుకు ముందు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ల‌ద్దాఖ్‌ను చైనా తీసుకుంటుందేమోన‌ని భ‌యంతో ఇలాంటి ప‌నులు కేంద్ర ప్ర‌భుత్వం చేస్తోంది."

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు వివాదంపై ప్ర‌భావం?

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు వివాదం వ‌ల్లే ఇదంతా జ‌రుగుతోంద‌ని బీజేపీ అధికార ప్ర‌తినిధి అల్తాఫ్ ఠాకుర్ వ్యాఖ్యానించారు.

"ల‌ద్దాఖ్‌లోని భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు వివాదం న‌డుమ సైనికుల‌కు తాత్కాలిక శిబిరాలు ఏర్పాటుచేసేందుకు గంద‌ర్‌బ‌ల్‌లో పాఠ‌శాల‌లు ఖాళీ చేయిస్తున్నారు. ఇలాంటి శిబిరాల‌తో సైనికుల రాక‌పోక‌లు కాస్త తేలిగ్గా పూర్త‌వుతాయి. ఎల్‌పీజీ విష‌యం సాధార‌ణ‌మైన‌దే. వాతావ‌ర‌ణం దృష్టిలో పెట్టుకొని ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు."

సాధార‌ణంగా జాతీయ ర‌హ‌దారిని శీతాకాలంలో మూసేస్తారు? వేస‌విలో కాదు క‌దా? అని ప్ర‌శ్నించ‌గా.. "ఈ సారి వ‌ర్షాలు ఎక్కువ‌గా ప‌డ‌తాయ‌ని అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌జ‌లు భ‌యంతో ఏదీ ఎక్కువ‌గా కొనుక్కోవ‌ద‌ని అభ్య‌ర్థిస్తున్నాం" అని స‌మాధానం ఇచ్చారు.

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత క‌శ్మీర్‌లో నెల‌ల‌పాటు క‌ర్ఫ్యూలు, ధ‌ర్నాలు, లాక్‌డౌన్‌లు, ఇంట‌ర్నెట్‌‌పై ఆంక్ష‌లు.. లాంటి చ‌ర్య‌లు కనిపించాయి.

క‌రోనావైర‌స్ కూడా మ‌రోసారి లాక్‌డౌన్‌కు కార‌ణ‌మైంది. ఈ తాజా ఆదేశాల‌తో ఏం జ‌రుగుతుందో అని అంద‌రూ చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Govt asks the companies to put a stock of LPG cylinders for 2 months
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X