వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేతన జీవులకు భారీ ఊరట: ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలు, ఏ శ్లాబ్‌కు ఎంత పన్ను అంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో మధ్య తరగతి వేతన జీవులకు ఆదాయ పన్ను పరిమితిపై భారీ ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు.. అంటే రెండింతలు పెంచారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం నాడు పార్లమెంటులో ప్రకటన చేశారు.గోయల్ ఈ రోజు (ఫిబ్రవరి 1) మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అయితే ఆదాయపన్ను పరిమితి పరిమితి అమలును వచ్చే ప్రభుత్వం భుజాలపై వేశారు.

ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్‌ను 24 గంటల్లో తీసుకోవచ్చునని తెలిపారు. ఆదాయపు పన్ను రీఫండ్లను 24 గంటల్లో పరిష్కరించి నిధులను విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు గోయల్ తెలిపారు. వచ్చే రెండేళ్లలో అన్ని పన్ను రిటర్నుల అంచనాలను కంప్యూటరీకరిస్తామని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు, అధికారులకు ఎటువంటి సంబంధం లేకుండా చేస్తామని తెలిపారు.

ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని రూ.5 లక్షలకు పెంచింది. దీనికి అదనంగా రూ.6.5లక్షల ఆదాయం ఉండి కొన్ని రకాల పెట్టుబడులు పెట్టిన వారికి కూడా పూర్తి పన్ను మినహాయింపును ఇచ్చింది. ఆదాయపు పన్ను స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.40 వేల నుంచి రూ.50 వేలకు పెంచింది. దీంతోపాటు పోస్టల్‌, బ్యాంక్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీపైనా రూ.40 వేల వరకు రాయితీని ఇచ్చింది. అంతేకాదు, రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని గ్రాట్యూటీగా అందుకొనే వారికి కూడా ఉపశమనం కల్పించారు. రూ.20లక్షల వరకు గ్రాట్యూటీపై పన్ను మినహాయించారు..

 రూ.5 లక్షల లోపు ఆదాయానికి పన్ను సున్నా, 3 కోట్ల మందికి ఊరట

రూ.5 లక్షల లోపు ఆదాయానికి పన్ను సున్నా, 3 కోట్ల మందికి ఊరట

ఈ మధ్యంతర ఎన్నికల బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి పథకంపై సభ హర్షం వ్యక్తం చేసింది. ఈ ప్రకటనతో మూడు కోట్ల మంది వేతన, మధ్య తరగతి ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. గత కొద్ది రోజులుగా ఈ బడ్జెట్‌లో ఆదాయ పన్ను పరిమితి రూ.3 లక్షలుగా ఉంటుందని, రూ.4 లక్షలుగా ఉంటుందని, రూ.5 లక్షలుగా ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఎట్టకేలకు కేంద్రమంత్రి దీనిని రూ.5 లక్షలుగా చేశారు. ఐదు లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను సున్నా అని చెప్పవచ్చు.

శ్లాబుల విషయానికి వస్తే

శ్లాబుల విషయానికి వస్తే

రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20 శాతం ఆదాయ పన్ను ఉంటుంది. రూ.10 లక్షల పైన ఎంత ఉన్నా 30 శాతం పన్ను ఉంటుంది. గతంలో రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి రూ.12,500 పన్ను ఉండేది. ఇప్పుడు అది సున్నా.

ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి ఉంటే రూ.6.5 లక్షల దాకా మినహాయింపు

ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే 6.5 లక్షల లోపు ఆదాయపన్ను మినహాయింపు ఉంటుంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పొదుపు చేసే వారికి పన్ను మినహాయింపు ఇస్తారు.

టీడీఎస్ పెంపు

టీడీఎస్ పెంపు

టీడీఎస్ పరిమిది రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచారు. పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ రూ.10వేల నుంచి రూ.40వేల కోట్లకు పెంచారు. సేవింగ్స్ పైన రూ.40వేల వరకు పన్ను మినహాయించారు. మధ్యంతర బడ్జెట్‌లో ఉద్యోగాలు, పింఛన్‌ధారులకు భారీ ఊరట లభించింది. స్టాండర్డ్ డిడక్షన్ రూ40వేల నుంచి రూ.50వేలకు పెంచారు.

English summary
Piyush Goyal proposes to raise income tax exemption limit to Rs 5 lakh but leaves implementation to next government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X