వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్లపై రాజకీయాలొద్దు: వెంకయ్య హితవు -సరిపడా వ్యాక్సిన్లు అందిస్తామన్న మోదీ -గవర్నర్లతో కాన్ఫరెన్స్

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదర స్థాయికి చేరడం, అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ టీకాలపై గవర్నర్లకు వెంకయ్య, మోదీ కీలక సూచనలు చేశారు..

షాకింగ్: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై శాశ్వత నిషేధం -డెన్మార్క్ సంచలన ప్రకటన -రక్తం గడ్డకట్టి మరణాలుషాకింగ్: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై శాశ్వత నిషేధం -డెన్మార్క్ సంచలన ప్రకటన -రక్తం గడ్డకట్టి మరణాలు

దేశంలో అన్ని ప్రాంతాలకూ సరిపడా వ్యాక్సిన్లను అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీకా ఉత్సవ్‌లో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కూడా విపరీతంగా వ్యాప్తి చేశామని, కొత్త వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని, తమ ప్రాంతాల్లోని సామాజిక సంస్థలు.. ప్రభుత్వాలతో కలిసి కరోనా నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించాలని గవర్నర్లకు ప్రధాని సూచించారు.

 Govt committed to ensure adequate availability of vaccines, PM Modi tells Governors

కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మైక్రో కంటెయిన్‌మెంట్ విధానాలను అవలంబించాలని, ఈసారి కూడా గతేడాదిలానే వ్యాక్సిన్ పంపిణీలో ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ ప్రధాన పాత్ర పోషిస్తాయని మోదీ చెప్పారు. ప్రజా భాగస్వామ్యంలో గవర్నర్ల పాత్ర చాలా కీలకమైందని, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఆయా రాష్ట్రాల్లోని సంస్థలతో సంస్థలను సరైన మార్గంలో నడపడం వల్ల దేశం సమస్యలనుంచి బయటపడుతుందని ప్రధాని పేర్కొన్నారు.

 Govt committed to ensure adequate availability of vaccines, PM Modi tells Governors

గవర్నర్లు, ఎల్జేలతో భేటీలో ప్రధానితోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు. కరోనాపై యుద్ధంలో అన్ని రకాల బేధభావాలను పక్కనపెట్టి.. రాజకీయ పార్టీలు, ఎన్జీవోలు, సామాజిక సంస్థలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజా సమూహాలు.. అన్నీ ఒక్కటి కావాలని వెంకయ్య పిలుపునిచ్చారు. కరోనా వ్యాక్సినేషన్‌, వైద్య విధానాల గురించిన సమాచారాన్ని అందరికీ తెలియజేయాలని ఆయన సూచించారు.

ఎంపీ రఘురామకు జగన్ మరో షాక్ -ప్రధాని అయ్యే అవకాశమింతే -అంబేద్కర్ సనాతన హిందువేనంటూఎంపీ రఘురామకు జగన్ మరో షాక్ -ప్రధాని అయ్యే అవకాశమింతే -అంబేద్కర్ సనాతన హిందువేనంటూ

English summary
Prime Minister Narendra Modi in his interaction with Governors and Lieutenant Governors of all States and Union Territories suggested that the Governors can actively engage to ensure that social institutions collaborate seamlessly with the State Governments towards micro containment. Vice-President M. Venkaiah Naidu urges everyone to put aside political differences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X