• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

CoWIN Data Breach: వ్యాక్సిన్లపై మరో దుమారం -అమ్మకానికి డేటా -ఖండించిన కేంద్రం -దర్యాప్తునకు ఆదేశం

|

కొవిడ్ వ్యాక్సిన్లపై కొంతకాలంగా కొనసాగుతోన్న వివాదాలు మరింత పెద్దవవుతున్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆయువుపట్టలాంటి 'కోవిన్ (CoWIN)' డిజిటల్ పోర్టల్ తాజా టార్గెట్ అయింది. టీకాల పంపిణీ మొత్తం కోవిన్ ద్వారానే సాగుతోన్న క్రమంలో ఆ పోర్టల్ హ్యాకింగ్ కు గురైందని, అందులోని డేటాను డార్క్ నెట్ లో అమ్మకానికి ఉంచారంటూ గురువారం సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం సదరు రిపోర్టులను తోసిపుచ్చింది. కోవిన్ పోర్టల్ సురక్షితంగా ఉందని, హ్యాకింగ్ కానీ, ఎలాంటి డేటా లీకేజీకానీ జరగలేదని స్పష్టంచేసింది.

రిజిస్ట్రేషన్ ఉంటేనే టీకా..

రిజిస్ట్రేషన్ ఉంటేనే టీకా..

దేశంలో వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారంతా తప్పనిసరిగా కోవిన్ యాప్ లేదా వెబ్‌సైటులో తమ వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటుండటం తెలిసిందే. కోవిన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ ఫోన్‌కి వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. అందులో వ్యక్తిపేరు, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌తో పాటు కొన్ని వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల వివరాలు నమోదు చేసుకోవాలి. దేశంలో ఇప్పటికే కోట్లాది మంది తమ వివరాలను కోవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. ఒకే ఒక్క డిజిటల్ వేదిక ద్వారా ఇన్ని కోట్ల మందికి టీకాలు అందించే ప్రక్రియ కొనసాగించడం సరైందికాదని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ క్రమంలో కోవిన్ పోర్టల్ ఎంతవరకు సురక్షితం? యూజర్ల డేటాకు సేఫ్టీ ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్న క్రమంలోనే చీకటి ప్రపంచం నుంచి వెలువడిన వార్త కలకలం రేపింది..

హ్యాకర్ల గ్రూప్ నుంచే లీక్..

హ్యాకర్ల గ్రూప్ నుంచే లీక్..

కోవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వినియోగదారుల డేటా డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉన్నట్లు హ్యాకర్స్‌ గ్రూప్‌ డార్క్‌ లీక్‌ మార్కెట్‌ పేర్కొంది. భారత్‌లో కొవిడ్‌ టీకా వేసుకున్న 150 మిలియన్ల మంది పేరు, మొబైల్‌ నంబర్‌, ఆధార్‌ ఐడీ, జీపీఎస్‌ వివరాలతో కూడిన సమాచారాన్ని 800 డాలర్లకు అమ్మకానికి ఉంచినట్లు తెలిపింది. ఈ ఉదంతపై జాతీయ, ప్రాంతీయ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. ఇప్పటిదాకా కోవిన్‌ యాప్‌ ద్వారా టీకా తీసుకున్న, రిజిస్ట్రేషన్ చేసుకున్నవారంతా ఆందోళనకు గురయ్యారు. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది..

  COVID Delta Variant : అల్ఫా కంటే 50 శాతం ఎక్కువగా డెల్టా వేరియంట్ వ్యాప్తి ! || Oneindia Telugu
  కోవిన్ డేటా లీక్ కాలేదన్న కేంద్రం

  కోవిన్ డేటా లీక్ కాలేదన్న కేంద్రం

  మీడియా రిపోర్టుల్లో, ఇంటర్నెట్ లో ప్రచారం జరుగుతున్నట్లు కోవిన్ యాప్ కు సంబంధించి ఎలాంటి ఒడిదుడుకులు జరగలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కోవిన్ పోర్టల్ హ్యాకింగ్ కు గురైందనే ప్రచారం వట్టిదేనని, యూజర్ల డేటా లీకైందన్న మాట కూడా అవాస్తవమంటూ గురువారం అర్ధరాత్రి తర్వాత ఆ శాఖ ఒక అధికారిక ప్రకటన చేసింది. ఎంపవర్డ్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ (EGVAC) సైతం డేటా బ్రీచ్ లాంటిదేదీ చోటు చేసుకోలేదని పేర్కొంది. కాగా, ఈ ఉదంతపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన నిపుణులు దర్యాప్తు చేస్తున్నారని, డేటా లీకైందనే ఆరోపణలకు కచ్చితంగా సమాధానం చెబుతామని, ప్రస్తుతానికి ఎలాంటి లీకేజీ జరగలేదని కేంద్రం తెలిపింది.

  కోవిన్‌లో జీపీఎస్ ఎక్కడుంది?

  కోవిన్‌లో జీపీఎస్ ఎక్కడుంది?

  ఎంపవర్డ్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ (EGVAC) చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కోవిన్ డేటా లీకైందంటూ వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవం. డార్క్ నెట్ లో అమ్మకానికి ఉన్నట్లుగా చెబుతోన్న యూజర్ల డేటాలో ‘‘జీపీఎస్‌ వివరాలను కూడా అమ్మకానికి పెట్టారు''అని ఉండటమే దీనికి నిదర్శనం. ఎందుకంటే, కోవిన్ పోర్టల్ లో లబ్దిదారుల జియో లొకేషన్(జీపీఎస్)కు సంబంధించిన వివరాలేవీ తీసుకోబోము. అలాంటిది జీపీఎస్ వివరాలు కూడా వెల్లడయ్యాయడం హాస్యాస్పదం'' అని డాక్టర్ శర్మ అన్నారు. కేంద్ర శాఖల దర్యాప్తులో మిగతా విషయాలు బయటపడే అవకాశముంది.

  English summary
  Refuting reports of CoWin data breach as "incorrect" and "baseless", the Ministry of Health on Thursday said that CoWin stores all the vaccination data in a safe and secure digital environment. Reports surfaced on Thursday claiming that a hackers' group had accessed the database of about 150 million users registered on CoWin and that the data was up for sale. The health ministry stated that the Computer Emergency Response Team of the Ministry of Electronics and Information Technology (MieIY) are investigating, adding, "No CoWin data is shared with any entity outside the CoWin environment."
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X