వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: ఐటీ కంపెనీల్లో ఉద్యోగ సంఘాల ఏర్పాటు నిర్ణయం వెనక్కు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సాప్ట్‌వేర్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ఐటీ రంగంలో ఉద్యోగ సంఘాల ఏర్పాటుకు అనుమతించాలన్న యోచనను కర్ణాటక ప్రభుత్వం విరమించుకొంది.ఐటీ పరిశ్రమలో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని సమాచారం.

సాఫ్ట్‌వేర్ రంగంలో చోటు చేసుకొన్న పరిస్థితుల కారణంగా టెక్కీలు ఈ ఏడాది ప్రథమార్థంలో ఉద్యోగాలను కోల్పోయారు. ఈ కారణంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగ సంఘాల ఏర్పాటుకు కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ కర్గే అనుమతిస్తామని ప్రకటించారు.అయితే ప్రస్తుతం ఐటీ పరిశ్రమల్లో మార్పులు వస్తున్నందున ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకొన్నట్టు కన్పిస్తోంది.

ఐటీలో ఉద్యోగ సంఘాల అనుమతి వెనక్కి

ఐటీలో ఉద్యోగ సంఘాల అనుమతి వెనక్కి

ఐటీ రంగంలో ఉద్యోగ సంఘాల ఏర్పాటుకు అనుమతించాలన్న యోచనను కర్ణాటక ప్రభుత్వం విరమించుకుంది. ఈ ఏడాది ఆరంభంలో పెద్దసంఖ్యలో సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో లేఆఫ్‌లు చోటుచేసుకున్న సమయంలో ఈ విషయంలో కర్ణాటక సర్కార్ సానుకూలంగా స్పందించింది.ఐటీ-బీటీ చట్టానికి సవరణలు అవసరమని, ఈ సవరణలపై ఆందోళనలు నెలకొన్నాయని ఆ సమయంలో కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ కర్గే చెప్పారు.

ఐటీ కంపెనీల్లో నియామకాలు

ఐటీ కంపెనీల్లో నియామకాలు

ఐటీ కంపెనీల్లో స్థబ్ధత వీడి పెద్ద ఎత్తున నియామకాలకు దిగుతుండటంతో యూనియన్లు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి లేదని భావిస్తున్నామని ఐటీ కార్యదర్శి గౌరవ్‌ గుప్తా చెప్పారు. ఈ కారణంగానే ఐటీ రంగంలో ఉద్యోగ సంఘాల ఏర్పాటు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

మారిన పరిస్థితులు

మారిన పరిస్థితులు

ఐటీ రంగంలో పరిస్థితులు మారాయని కర్ణాటక ఐటీ శాఖ అభిప్రాయపడుతోంది.ఇన్ఫోసిస్‌, విప్రో, గూగుల్‌ వంటి కంపెనీలు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు ప్రారంభించడంతో ఉద్యోగావకాశాల విషయంలో పరిశ్రమలో సానుకూల వాతావరణం నెలకొందని ఆయన చెప్పారు.

నైపుణ్యాల మెరుగు

నైపుణ్యాల మెరుగు

ప్రస్తుత ఉద్యోగులకు సైతం నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు కంపెనీలు శిక్షణ ఇస్తుండటం మంచి పరిణామమని కర్ణాటక ఐటీ సెక్రటరీ గౌరవ్ గుప్తా చెప్పారు. చెప్పారు.మరోవైపు చెన్నై, పూణేల్లో ఐటీ యూనియన్‌లు కార్యకలాపాలు కొనసాగుతున్న క్రమంలో బెంగళూర్‌లోనూ ఐటీ యూనియన్ల ఏర్పాటుకు అనుమతించాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు.

English summary
The government has decided to drop the idea of allowing labour unions in the IT sector, a promise which IT and BT minister Priyank Kharge had made following large-scale layoffs in the software industry early this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X