వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే చర్యలే: కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ సరైన సమయానికి కార్యాలయాలకు రావాలని, లేదంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సరైన సమయానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్ని మంత్రిత్వ శాఖలకు సిబ్బంది, శిక్షణా వ్యవహారాల సంస్థ(డీవోపీటీ) లేఖలు రాసింది.

ద్యోగులు తరచూ ఆలస్యంగా రావడాన్ని అనుచిత ప్రవర్తనగా భావించి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డీవోపీటీ పేర్కొంది. ఉద్యోగుల హాజరుపై అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేసింది.

Govt Employees get punctuality lessons; late comers to face punishment

అన్ని వేళల అంకితభావంతో పనిచేస్తానని సర్వీసు నిబంధనలోనే ఉందని పేర్కొంది. వారి పరిధిలోని ఉద్యోగులు సరైన సమయానికి వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఆయా మంత్రిత్వశాఖలపై ఉంటుందని పేర్కొంది.

ఆధార్‌తో అనుసంధానం చేసిన బయోవెుట్రిక్‌ విధానాన్ని అమలు చేయాలని మంత్రిత్వశాఖలను కోరింది. గంటలోపు ఆలస్యంగా వస్తే సగం రోజు సెలవు కిందే పరిగణిస్తారని.. నెలలో రెండు రోజులకు మాత్రం సరైన కారణంతో మినహాయింపు ఉంటుందని పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 48లక్షలమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

English summary
The Central Government on Tuesday, June 23 issued a strict notifications for all government employees of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X