వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిటల్ ఇండియా : డ్రోన్ల కోసం రూ.వెయ్యి కోట్లు, ఎందుకో తెలుసా ...?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : డ్రోన్ల సేవలను వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్ల వ్యయం చేయాలని నిర్ణయానికి వచ్చింది. డ్రోన్ల సేవలతో దేశాన్ని డిజిటల్‌గా మార్చుకోవచ్చని అంచనా వేసింది. టోపోగ్రాఫిక్స్ డేటా బేస్ రూపొందించడానికి ఇంత మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్నట్టు పేర్కొన్నది. దీంతో సంబంధించిన విషయం గురించి త్వరితగతిన తెలుసుకునే వెసులుబాటు దక్కుతుందని భావిస్తోంది.

దేశంలో డిజిటల్ మ్యాప్‌తో భూముల వివరాలు త్వరితగతిన తెలుసుకునే వీలుందని భావిస్తున్నారు. సామాజిక, ఆర్థిక డేటా, రోడ్ నెట్‌వర్క్‌తోపాటు వివిధ రికార్డులు ఉంటాయని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ ఐఐఎస్‌లో మీడియాకు వివరించారు. ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Govt has a Rs 1,000-cr plan to digitally map India using drones

మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో ఇప్పటికే ఈ విధానం ప్రారంభించామని పేర్కొన్నది. తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని .. అయితే అందుకు సంబంధిత ప్రభుత్వం ఆసక్తి కనబరచాలని పేర్కొన్నది. డ్రోన్లలో అధిక రిజల్యూషన్ 3 డీ మ్యాప్‌తో రూపొందిస్తారు.

English summary
The Centre plans to spend as much as Rs 1,000 crore to digitally map the country using drones and validate through foot on street to create a topographic database. “The need to have a digital map of India was felt as it would enable better decision making in the government. The map will have all types of records including land details, socio-economic data, road network, etc,” Prof Ashutosh Sharma, secretary to the government (Ministry of Science and Technology) told reporters at Indian Institute of Science on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X