వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీగా ఖర్చులు చేశాం.. డిమాండ్ పెంచడమే ధ్యేయమన్న నిర్మల -బడ్జెట్ స్పీచ్ 110నిమిషాలే

|
Google Oneindia TeluguNews

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది బడ్జెట్ రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తద్వారా ఆ గుణాత్మక ప్రేరణ ఖర్చుగా, ఆ ఖర్చులతో అవసరమైన డిమాండ్లకు ఊతం లభిస్తుందని చెప్పారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేశారు.

పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం తర్వాత ఢిల్లీలో మీడియాతో మాట్లడిన ఆమె.. ఫిబ్రవరి 2020 లో 3.5%గా ప్రారంభమైన ద్రవ్య లోటు జిడిపిలో 9.5 శాతానికి పెరిగిందని, కాబట్టి నిధుల్ని విపరీతంగా ఖర్చు చేశామని, అదే సమయంలో, లోటు నిర్వహణకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ వ్యయం, రెవెన్యూ స్టేట్మెంట్ల అకౌంటింగ్ ఇప్పుడు చాలా పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉందని నిర్మల చెప్పారు.

 Govt has spent, spend & spent says FM nirmala, 110 minutes budget speech is shortest

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం మొదటి ధ్యేయం కాగా, రెండవ లక్షణంగా ఆరోగ్య సంరక్షణ రంగాన్ని భావించామని, మెరుగైన ఆరోగ్య నిర్వహణ కోసం సామర్థ్యాలను గత సంవత్సరం నుంచి పెంచుతూ వస్తున్నామన్నారు. రోడ్లు, విద్యుత్ ఉత్పత్తి, వంతెనలు, ఓడరేవులు మొదలైన వాటిలో విస్తరించి ఉన్న మౌలిక సదుపాయాల కోసం మేము పెద్దగా ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఇక..

union budget 2021: రివ్యూ -సామాన్యుణ్ని పిండేసిన నిర్మల -బ్రేక్ ఫెయిల్.. హారన్ సౌండ్ పెంపుunion budget 2021: రివ్యూ -సామాన్యుణ్ని పిండేసిన నిర్మల -బ్రేక్ ఫెయిల్.. హారన్ సౌండ్ పెంపు

గత బడ్జెట్ ప్రసంగాలతో పోలిస్తే... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి అతి తక్కువ సమయంలో తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. కేవలం గంట 48 నిమిషాల్లో సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారు. 2019 బడ్జెట్ ప్రసంగం రెండు గంటల 15 నిమిషాల పాటు సాగింది. ఇక 2020 బడ్జెట్ ప్రసంగం రెండు గంటల 42 నిమిషాల పాటు సాగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 వార్షిక బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అంతకు పూర్వం కేంద్ర కేబినెట్ ఈ బడ్జెట్‌ను ఆమోదించింది.

English summary
Finance Minister Nirmala Sitharaman on the just tabled Union Budget 2021: "This Budget comes at a time when all of us decided to give impetus to the economy and that impetus, we thought, would be qualitatively spent and give necessary demand push if we choose to spend big on infrastructure. Sitharaman on Monday presented the Budget 2021-22 that lasted around one hour and 50 minutes. This was a shorter speech compared to the last two years where Sitharaman spoke for over two hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X