వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యుడిపై అదనపు భారం: పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు.. లీటరుకు ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రం మరోమారు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది. లీటరు పెట్రోలు డీజిల్ పై రూ. 3 పెంచుతూ శనివారం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పతనం కావడంతోనే ప్రభుత్వం పెట్రోల్ డీజిల్‌ ధరల పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతోంది.ఇక పెట్రోల్ పై ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ లీటరుకు రూ.2 నుంచి రూ.8వరకు పెంచగా.. లీటర్ డీజిల్‌పై రూ.4 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇక దీనికి అదనంగా రోడ్ సెస్ కూడా పెంచింది కేంద్రప్రభుత్వం. లీటర్ పెట్రోల్‌పై రూ.1 పెంచగా అదే లీటర్ డీజిల్‌పై రోడ్ సెస్ రూ. 10వరకు పెంచింది. ఇక ఎక్సైజ్ సుంకంను పెంచిందంటే పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా పెరిగిపోతాయనే సంకేతాలు ఇచ్చింది కేంద్రం.

Govt hikes Petrol and Diesel rates amid the fall in crude oil in global markets

అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో తప్పని పరిస్థితుల్లో కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచాల్సి వచ్చిందని అయితే ముడిచమురు ధరలు సాధారణ స్థితికి చేరుకోగానే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గుముఖం పడుతాయని ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చెబుతున్నారు.

Recommended Video

Coronavirus In AP : No Biometric Attendance To Emplyoees In Govt Offices | Oneindia Telugu

ఇదిలా ఉంటే పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం చర్యను తప్పుబట్టాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైన వేళ దేశంలోని సామాన్యుడిపై కేంద్రం అదనపు భారం వేస్తోందని విమర్శించారు కమ్యూనిస్ట్ నేత సీతారాం ఏచూరి. ఇప్పటికే కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని గుర్తు చేసిన సీతారాం ఏచూరి... యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలైమందన్నారు. మరోవైపు ప్రభుత్వంకు అనుకూలంగా ఉండే వారి రుణాలను మాఫీ చేస్తున్న ప్రభుత్వం... ఇతర సామాన్య ప్రజలపై మాత్రం ఇలా పెట్రోలు డీజిల్ ధరలు పెంచి భారం మోపుతోందని మండిపడ్డారు.

English summary
Excise duty on petrol and diesel was on Saturday hiked by Rs 3 per litre as the government looked to mop up gains arising from fall in international oil prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X