వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలపై ఫిర్యాదులు: నిర్మలా సీతారామన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ ‘ఫ్లిప్‌కార్ట్' దసరా పండగ నేపథ్యంలో ప్రవేశపెట్టిన డిస్కౌంట్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందినట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారని, దీనిపై తప్పకుండా పరిశీలిస్తామని చెప్పారు.

ప్రస్తుతం ఈ విషయంపై అధ్యయనం చేస్తున్నామని ఒక వేళ ప్రత్యేక విధానం లేక ఈ-కామర్స్ రిటైల్ వ్యాపారంపై స్పష్టత అవసరమా? అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నామని అన్నారు. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.

 Govt. to look into Flipkart sale after complaints: Nirmala Sitharaman

‘బిగ్ బిలియన్ డే' స్కీం పేరుతో ఫ్లిప్ కార్ట్ ఇటీవల ఇచ్చిన ఆఫర్ డిస్కౌంట్‌కు 1.5 మిలియన్ల మంది తమ పోర్టల్‌లో షాపింగ్ చేశారని, పది గంటల్లో రూ. 600 కోట్లకు పైగా ఉత్పత్తులు అమ్ముడయ్యాయని సదరు సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.

అంతేగాక బిగ్ బిలియన్ డే ద్వారా వినియోగదారులను సంతృప్తి పరచడంలో విఫలమయ్యామని, అనుకున్నస్థాయిలో పనితీరును కనబర్చలేకపోయామని ప్లిఫ్‌కార్డ్ అంగీకరించింది. ఇందుకుగాను ప్రతి ఒక్క వినియోగదారుడికి క్షమాపణ చెబుతున్నట్లు తెలిపింది. మరోసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించదలిస్తే పూర్తి సన్నద్దతతో చేస్తామని హామీ ఇచ్చింది.

English summary
“We have received many inputs. Lot of concerns have been expressed. We will look into it,” Commerce and Industry Minister Nirmala Sitharaman told reporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X