వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్‌ పని ఔట్: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్ధాన్‌లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్‌లను ఏ క్షణంలోనైనా మట్టుబెట్టడం ఖాయమని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోమవారం ఆయన ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఈ ప్రకటన చేశారు. భారత్ తన శత్రువుల పట్ల ఎంతమాత్రం నిర్లక్ష్యం వహించబోదన్న ఆయన కోవర్ట్ లేదా ప్రత్యేక ఆపరేషన్ ద్వారా దావూద్ ఇబ్రహీంను మట్టుబెడతామని ఆయన పేర్కొన్నారు.

Govt may carry out covert operation against Dawood Ibrahim: Rajyavardhan Rathore

1993 ముంబై పేలుళ్ల ఘటనలో ప్రధాని నిందితుడైన దావూద్ ఇబ్రహీంపై మిలిటరీ ఆపరేషన్ ఎందుకు కొనసాగించడం లేదని అడిగిన ప్రశ్నకు గాను కోవర్ట్ ఆపరేషన్ వేస్తే దాని విషయాలు బయటకు తెలియవని, ప్రత్యేక ఆపరేషన్‌నే చేపడతామని ఆయన ప్రకటించారు.

‘‘సామ, దాన, భేద, దండోపాయాల సంగతి తెలుసు కదా. వీటిలో కొన్నింటిని దావూద్ పై ఇప్పటికే ప్రయోగించాం. 1993 ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడిగా ఉన్న దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ అతడి ప్రతి కదలికపై మాకు పూర్తి సమాచారం ఉంది. ప్రభుత్వ నిర్ణయమే తరువాయి. ఏదో ఒక సందర్భంగా దావూద్ పని ముగించేస్తాం'' అని రాథోడ్ వ్యాఖ్యానించారు.

English summary
Minister of State for Information and Broadcasting Rajyavardhan Singh Rathore on Monday said that the government would explore every possible means, including carrying out a covert or a special operation, to neutralise Pakistan-based terrorists Dawood Ibrahim or Hafiz Saeed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X