వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్కారు మెజారిటీతో నడుస్తుంది కానీ దేశానికి ఏకాభిప్రాయమే దిక్కు -అది బీజేపీనే: ప్రధాని మోదీ

|
Google Oneindia TeluguNews

ఒక పార్టీ ప్రభుత్వాన్ని నడపించడానికి తగినంత మెజారిటీ ఉంటే సరిపోతుందని, అయితే, దేశాన్ని నడిపించడానికి మాత్రం ఏకాభిప్రాయం కచ్చితంగా అవసరమే అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశాన్ని నడిపించడంలో ఏకాభిప్రాయ సాధనకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తుందని, రాజకీయ అంటరానితనాన్ని ఏనాడూ విశ్వసించని బీజేపీ.. దేశభక్తే ప్రేరణగా పనిచేస్తుందని, బీజేపీ రాజకీయాల్లో అత్యున్నతమైనది జాతీయవాదమే అని ఉద్ఘాటించారు.

ys sharmila ఊపుతో జూ.ఎన్టీఆర్ కొత్త పార్టీ -మళ్లీ సమైక్య రాష్ట్రం -వైఎస్ ఆశయం: జగ్గారెడ్డి సంచలనంys sharmila ఊపుతో జూ.ఎన్టీఆర్ కొత్త పార్టీ -మళ్లీ సమైక్య రాష్ట్రం -వైఎస్ ఆశయం: జగ్గారెడ్డి సంచలనం

ఆర్ఎస్ఎస్ దివంగత నేత, బీజేపీ సిద్ధాంత కర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 53వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. బీజేపీ ఎంపీలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. గతంలో రాజకీయంగా అంటరాన్నితనాన్ని అనుభవించిన బీజేపీ.. తన జాతీయవాద దృక్పథంతో అందరినీ కలుపుకొంటూ, ఏకాభిప్రాయ సాధనకు కృషిచేస్తున్నదని ఆయన తెలిపారు.

 Govt may run with majority but nation runs with consensus: PM Modi to BJP MPs

రాజకీయాల కంటే జాతీయ విధానాలకే బీజేపీ ప్రాధాన్యం ఇస్తుందన్న మోదీ.. ఇటీవల కాలంలో ఆ దిశగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, మహనీయుల కలలు నెరవేరుతుండటం శుభపరిణామాలని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులకు సైతం ప్రభుత్వ పురస్కారాలను ప్రదానం చేసిన సంగతిని గుర్తు చేశారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 'భారత రత్న', అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్, నాగాలాండ్ మాజీ సీఎం ఎస్‌సీ జమీర్‌లకు పద్మ అవార్డులను ప్రదానం చేసిందని, వీరంతా కాంగ్రెస్‌ నేతలేనని మోదీ గుర్తుచేశారు.

 Govt may run with majority but nation runs with consensus: PM Modi to BJP MPs

''దేశభక్తే మన భావజాలానికి ప్రేరణ. దాని అంతిమ ప్రయోజనం కూడా దేశం కోసమే. బీజేపీ రాజకీయాల్లో అత్యున్నతమైనది జాతీయవాదమే. ప్రభుత్వాన్ని మెజారిటీ నడిపిస్తుందని, కానీ దేశం ఏకాభిప్రాయంతోనే నడుస్తుంది. మనం కేవలం ప్రభుత్వాన్ని నడపటానికి రాలేదు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వచ్చాం'' అని ప్రధాని వ్యాఖ్యానించారు. గతంలో..

 Govt may run with majority but nation runs with consensus: PM Modi to BJP MPs

షాకింగ్: జగన్ పుట్టి ముంచిన కేంద్రం -విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సంచలనం -19నుంచే సీఎంకు తెలుసన్న ప్రధాన్షాకింగ్: జగన్ పుట్టి ముంచిన కేంద్రం -విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సంచలనం -19నుంచే సీఎంకు తెలుసన్న ప్రధాన్

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం.. ప్రత్యర్థి పార్టీల నేతలనేకాదు.. సుభాశ్ చంద్రబోస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వంటి జాతీయ నేతల సేవలను స్మరించుకుంటూ, ఆదరిస్తోందని, ఇతర ప్రభుత్వాలు గతంలో ఇలా చేసి ఉండేవి కాదని ప్రధాని అన్నారు. అణగారిన వర్గాలవారి సాధికారత, మానవతావాదం దీనదయాళ్ ఆదర్శాలని, ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తోన్న స్వయం సమృద్ధ భారత్, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆయనే స్ఫూర్తి అని మోదీ పేర్కొన్నారు.

 Govt may run with majority but nation runs with consensus: PM Modi to BJP MPs
English summary
While addressing an event in Delhi to mark the 53rd death anniversary of Deendayal Upadhyay, Prime Minister Narendra Modi on Thursday asserted that the BJP does not believe in political untouchability and values consensus in running the country. He noted that his government has bestowed state honours on even the ruling party's political rivals to acknowledge their service to the nation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X