వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం కొత్త ప్రణాళిక: ఎంబీబీఎస్ డాక్టర్లకు 'ఎగ్జిట్ ఎగ్జామ్'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ విద్యను అభ్యసించిన తర్వాత జూనియర్ డాక్టర్లు, పూర్తి స్ధాయి డాక్టర్లుగా మారి తమ ప్రాక్టీసును ప్రారంభించడానికి వారిలోని నైపుణ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న మెడికల్ విద్యార్ధులకు 'ఎగ్జిట్ ఎగ్జామ్' నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తుంది.

Govt plans exit exam for MBBS doctors

ప్రస్తుతం మెడికల్ విద్యాభ్యాసం పూర్తి చేసిన డాక్టర్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో వారంతట వారే రిజిస్టర్ చేసుకుంటున్నారు. వేరే రాష్ట్రంలో ప్రాక్టీసు చేయాలని అనుకుంటే, వారి యొక్క రిజిస్ట్రేషన్‌ ను బదిలీ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం తాజాగా నిర్వహించతలపెట్టిన ఈ 'ఎగ్జిట్ ఎగ్జామ్' లో ఉత్తీర్ణలైన వారు దేశంలో ఎక్కడైనా ప్రాక్టీస్ నిర్వహించుకోవచ్చు.

ఈ పరీక్షలో ఫెయిలైన డాక్టర్లు పీజీ విద్యను చదివేందుకు అనుమతి లేదు. అంతే కాదు ఈ పరీక్షలో అర్హత సాధించిన డాక్టర్లతో 'ఆల్ ఇండియా చాఫ్టర్' ను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నైపుణ్యం కలిగిన పూర్తి స్ధాయి వైద్యులే సేవలందించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలకు కేంద్రం అమోదించాల్సి ఉంది.

English summary
The health ministry is planning an exit exam for MBBS students passing out of government as well as private medical colleges. The move comes in the wake of concerns over the quality of doctors being produced in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X