వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీవీఐపీ రహస్య పర్యటనలకు చెక్, విదేశాలకు కూడ భద్రతా సిబ్బంది

|
Google Oneindia TeluguNews

వీవీఐపీల రహస్య పర్యటనలకు కేంద్రం చెక్ పెట్టింది. వారు విదేశాలకు వెళ్లినా వారు భద్రతా సిబ్బందిని వెంట తీసుకెళ్లాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే దేశంలో అత్యంత ప్రముఖులకు ఇచ్చే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) నిబంధనలను కేంద్ర హోం శాఖ తాజాగా సవరించింది. వీవీఐపీలకు కేటాయించే ఎస్పీజీ బృందం విధులపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో వీవీఐపీలు విదేశాలకు వెళ్లిన సిబ్బందిని వారి వెన్నంటే ఉండాలని నిబంధనల్లో పేర్కోంది. లేదంటే వారి విదేశీ ప్రయాణలపై చర్యలు తీసుకోనుంది.

ముఖ్యంగా ఇటీవల జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఆయన కుటుంబం విదేశాలకు వెళ్లినప్పుడు ఎస్పీజీ భద్రతా సిబ్బందిని వదిలి సమాచారం లేకుండా పలు దేశాలు తరిగివచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వారి కుటుంబానికి ప్రమాదం పొంచి ఉండడంతో వారి భద్రతా దృష్ట్యా మార్పులు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినా ఎస్పీజీ సిబ్బందిని వెంటతీసుకుని వెళ్లాలని కూడ చెప్పినట్టు తెలుస్తోంది.

Govt revises security rules for VVIPs

గాంధీ కుటుంబీకులు ఇప్పటి దాకా విదేశాలకు వెళ్లినపుడు మొదట గమ్యస్థానం చేరేవరకు ఎస్‌పీజీ సిబ్బంది వారిని అనుసరిస్తూ రక్షణ కల్పించేవారు. అక్కడినుంచి ఎస్‌పీజీ సిబ్బందిని వెనక్కి పంపి వారు వెళ్లాల్సిన ప్రదేశాలకు వెళ్లి పర్యటనలు ముగించుకుని వచ్చేవారు. అలా చేసే కొన్ని సందర్భాల్లో భద్రతాపరమైన ఇబ్బందులకు గురవుతున్నారు. సవరించిన భద్రతా నియమాల కారణంగా వీవీఐపీల రహస్య పర్యటనలకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి.
కాగా రాహుల్ గాంధీ ఇటివల కాంబోడియా పర్యటనకు వెళ్లిన వచ్చిన అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

English summary
The Centre has taken a measure to streamline the security cover accorded to the SPG protectees,SPG has been issued fresh guidelines by the Centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X