• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పర్యావరణ పరిరక్షణకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించిన అంతర్జాతీయ సంస్థలు

|

న్యూఢిల్లీ: వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది భారత ప్రభుత్వం. పలు అంతర్జాతీయ వేదికలపై వాతావరణం, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించింది. ఈ క్రమంలోనే చారిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందంపై సంతకం చేయడమే కాకుండా.. అంతర్జాతీయ సోలార్ సమాఖ్యకు నేతృత్వం వహించడంపై పలు అంతర్జాతీయ సంస్థలు భారత ప్రభుత్వాన్ని అభినందించాయి.

డిసెంబర్ 2015లో చారిత్రాత్మక పారిస్ ఒప్పందంపై భారత్ సంతకాలు చేసింది. కార్బన్ డైఆక్సైడ్ విడుదలకు కారణమవుతున్న వాటిని అణిచివేయాలనేది ప్రధాన అంశంగా ఈ ఒప్పందంలో ఉన్నాయి. కార్బన్ కారకాలను అణిచివేయడం ద్వారా వాతావరణంలో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగకుండా నియంత్రించాలనే ఉద్దేశంతో భారత్ పనిచేస్తోంది. గాల్లోకి కార్బన్ ఉద్గారములు విడుదల చేసే దేశాల్లో భారత్ 6శాతం కార్బన్ ఉద్గారములు విడుదల చేస్తుండగా.. ఆ తర్వాత చైనా 28శాతం, అమెరికా 16 శాతం, యూరోపియన్ సమాఖ్య దేశాలు 10శాతంను గాల్లోకి కార్బన్ ఉద్గారములు విడుదల చేస్తున్నాయి.

Govts assertive stance on environment matters draws global appreciation

ఫ్లోరా ఫౌనాల నుంచి సర్వేలా ఆధారంగా కృూర మృగాలను, అంతరించిపోతున్న పశుపక్ష్యాదులను కేంద్రప్రభుత్వం పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. భారత పర్యావరణ మరియు అటవీశాఖ విధానాలు కార్యక్రమాల అమలు బీజేపీ ప్రభుత్వం చక్కగా నిర్వర్తిస్తోంది. ఇందుకోసం కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మరియు వాతావరణశాఖలు చాలా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాన్ని పెంచడం, కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు పర్యవేక్షించడం, 10లక్షల కోట్లు పెట్టుబడులు ఒకదశలో ఇరక్కపోయి ఉండగా వాటికి ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వడంలాంటివి చేసింది.అంతేకాదు 600 రోజుల్లో పూర్తికావాల్సిన ప్రాజెక్టు పనులను 190 రోజుల్లో కంప్లీట్ చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

అటవీప్రాంతంను పెంచుతున్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటి. 2015 గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం అటవీప్రాంతం మరియు వృక్ష సంపద 794, 254 చదరపు కిలోమీటర్లుగా తెలుస్తోంది.ఇది భారత భూవిస్తీర్ణంలో 24.16శాతంగా ఉంది. 2013 గణాంకాలతో పోలిస్తే అటవీప్రాంతం 3,775 చదరపు కిలోమీటర్లుకు పెరిగిందని కేంద్రం తెలిపింది. అటవీప్రాంతాల నుంచే 30శాతం వరకు ఇంధన కలపకోసం వినియోగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పశు పక్షాదులకు ఆహారం కూడా 40 శాతం అడవుల నుంచే వస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India has taken an assertive global position on climate change in recent years. India signing the historic Paris climate agreement and inititive to head the International Solar Alliance garnered international appreciation.The ambitious Paris agreement, signed in December 2015, requires the member countries to make binding commitments to curb carbon dioxide (CO2) emissions to keep global average temperatures from rising above 1.5°C as compared to the pre-industrial years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more