వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడ్ ఆఫ్ ఎథిక్స్ డ్రాఫ్ట్: సోషల్ మీడియా నియంత్రణకు సిద్ధమైన కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోషల్ మీడియాకు స్వేచ్ఛ ఉంది కానీ, చట్టాలకు లోబడే పనిచేయాలని ఇ్పటికే స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా, సోషల్ మీడియాపై నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. కొన్ని ఖాతాలను బ్లాక్ చేసే విషయంలో సోషల్ మీడియా దిగగ్జం ట్విట్టర్, కేంద్రం మధ్య వివాదం కొనసాగుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది.

సోషల్ మీడియా వేదికలు, ఓవర్ ది టాప్(ఓటీటీ) ప్లాట్ ఫామ్స్, న్యూస్‌కు సంబంధిత వెబ్‌సైట్లను నియంత్రించడానికి నిబంధనల రూపకల్పనపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో కోడ్ ఆఫ్ ఎథిక్స్ నిరంతర సమ్మతి నివేదకలను సమర్పించడంతోపాటు స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు తదితర నిబంధనలను ఇందులో పొందుపర్చింది.

 Govts Draft Rules on Social Media Regulation Include a Code of Ethics: Amid Feud With Twitter

ఏ క్షణంలోనైనా దర్యాప్తు సంస్థల నుంచి ఫిర్యాదు వచ్చినా నిరంతర సమ్మతి నివేదికలను సమర్పించడానికి, ప్రతి స్పందించేందుకు 24X7 ఒక చీఫ్ కంప్లియన్స్ అధికారిని నియమించాల్సిన అవసరాన్ని ఈ నిబంధనలు చర్చిస్తాయి. అంతేగాక, ఫిర్యాదుల పరిష్కార విభాగ పోర్టల్, పర్యవేక్షణ విభాగం కూడా ఉంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి.

కాగా, ఈ పర్యవేక్షణ విభాగాన్ని ప్రభుత్వం నియమిస్తుంది. పబ్లిషర్లు, స్వీయ నియంత్రణ, సంస్థలు పాటించాల్సిన కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. ఎమర్జెన్సీ సమయాల్లో తగు చర్యలు తీసుకునే అధికారం కార్యదర్శి స్థాయి అధికారిక ఉంటుంది. దీనిపై 48 గంటల్లో పర్యవేక్షణ కమిటీ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
కోర్టులు గానీ, నియమిత సంస్థ గానీ ఆదేశించిన 36 గంటల్లో సంబంధిత సంస్థలు సదరు సమాచారాన్ని పూర్తిగా తొలగించాలన్న నిబంధనను చేర్చనున్నారని తెలుస్తోంది. అయితే, శిక్షలు ఎలా ఉంటాయన్న నిబంధనలను ఇప్పటికైతే పేర్కొనలేదు. కాగా, సోషల్ మీడియా సంస్థలపై అకౌంటబిలిటీతో కూడిన స్వేచ్ఛను ప్రోత్సహించేలా లీగల్ ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు అవసరం ఉందని ప్రభుత్వం రూపొందించిన నివేదిక స్పష్టం చేస్తోంది.

English summary
Even as the face-off between the Narendra Modi administration and Twitter continues to intensify with the social media defiantly refusing to follow orders to ban a host of accounts flagged by the government, the Centre has formulated draft rules to regulate all social media, OTT (Over The Top) platforms and news-related websites, NDTV reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X