వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాత పెన్షన్ విధానంకు కేంద్రం నో.... లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ ఉద్యోగులకు పాత పద్దతి పెన్షన్లను తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిరాకరించింది. ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం లోక్‌సభలో ఇచ్చింది. పాత పెన్షన్ విధానంను కొత్తగా వచ్చిన నేషనల్ పెన్షన్ స్కీముతో 2004లో రీప్లేస్ చేసింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. కొత్త విధానంలో సర్వీసు కాలంను పరిహారంను పరిగణలోకి తీసుకుని పెన్షన్ ఇస్తారు.

2004లో జాతీయ పెన్షన్ విధానంను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది నాటి ప్రభుత్వం. ఇ క ఆ తర్వాత ఈ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా వర్తించేలా నిబంధనలు తీసుకొచ్చింది. ఇక కొందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులైతే జాతీయ పెన్షన్ విధానంతో విబేధించారు. దీనివల్ల నష్టమే కానీ ఉద్యోగులకు ఎలాంటి లాభం చేకూరదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో పాత పెన్షన్ విధానంనే అమలు చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కొత్త పెన్షన్ విధానమే కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టంగా చెప్పకుండా దాటవేస్తోంది.

Govt says no for Old Pension scheme, gives in written in Loksabha

ఇదిలా ఉంటే పాత పెన్షన్ విధానంను ఎందుకు తిరిగి అమలు చేయలేకపోతున్నామనేదానిపై ప్రభుత్వం కారణం చెప్పింది. మొదటిగా పెన్షన్ బిల్లులు పెరిగిపోతుండటమే కాకుండా బిల్లు మొత్తం నిలకడగా ఉండటం లేదనే కారణం చెప్పింది. ఇక 2019 బడ్జెట్‌లో నేషనల్ పెన్షన్ స్కీముకు కేటాయించిన నిధులు 10శాతం నుంచి 14 శాతంకు పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎస్ టైర్-2లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా అనుమతించింది. తద్వారా ట్యాక్స్ మినహాయింపులను పొందొచ్చని స్పష్టం చేసింది. ఎన్‌పీఎస్ నిధులు మెచ్యూరిటీ తీరగానే దానిపై పన్ను మినహాయింపులను 40శాతం నుంచి 60 శాతంకు పెంచింది. ఈ స్కీములన్నీ చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకునేలా చేశాయి.

English summary
The government denied possibility of reintroduction of Old Pension Scheme (OPS) for government employees, given a written reply in the Lok Sabha. OPS was replaced by National Pension Scheme (NPS) in 2004, for a defined benefit pension given to government employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X