వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా దీక్ష: లోక్‌పాల్ బిల్లు తెస్తామని ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

ముంబై: సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి జన్ లోక్‌పాల్ బిల్లు కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా రాలెగావ్‌సిద్ది గ్రామంలోని యాదవ్ బాబా ఆలయంలో ఆయన మంగళవారం నిరవధిక నిరశన దీక్ష ప్రారంభించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే జన్ లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలని హజారే డిమాండ్ చేశారు.

దీక్షా శిబిరం వద్ద జన్‌తంత్ర మోర్చ పేరుతో నూతన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. జన్ లోక్‌పాల్ బిల్లుపై యూపిఏ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేదంటే ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని ఈ సందర్భంగా అన్నా అన్నారు. కాగా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం తాము లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.

Anna goes ahead with his hunger strike

కేంద్రమంత్రి వి నారాయణస్వామి మాట్లాడుతూ.. డిసెంబర్ 20లోపు ముగిసే పార్లమెంటు సమావేశాల్లోనే లోక్‌పాల్ బిల్లును ఆమోదించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా బిల్లు పార్లమెంటులో ఆమోదించే వరకూ తన దీక్షను కొనసాగిస్తానని అన్నా హజారే ప్రకటించారు.

లోక్‌పాల్ బిల్లు విషయమై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశానని, ఆయన మాట నిలుపుకోకపోవడంతో నిరాశ చెందానని అన్నా హజారే ఇటీవల చెప్పారు. అవినీతి కేసులలలో స్వతంత్రత కలిగిన బృందంతో విచారణ జరిపే ప్రజా విచారణ చట్టమే జన్ లోక్‌పాల్ బిల్లు. గతంలో కూడా అన్నా హజారే ఢిల్లీ వేదికగా లోక్‌పాల్ బిల్లు కోసం పోరాటం కొనసాగించారు.

English summary
Veteran activist Anna Hazare launched an indefinite hunger strike at his native village Ralegan Siddhi to press for the passage of the Jan Lokpal Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X