వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో హరిజన్.. రాజస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ స్కూళ్లు దాదాపు దళితుల ఇంటి దగ్గరలో ఉంటాయి. ఆయా గ్రామాల్లో ఇతర ప్రభుత్వ పాఠశాలలు ఉండటంతో ముందు హరిజన్ అని పలుకుతారు. సాధారణంగా అందరూ పిలుస్తుంటారు. కానీ మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వ పాఠశాల ముందు హరిజన్ పదం నిషేధించినట్టు రాజస్థాన్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇకపై అలా పిలువకూడదని, బోర్డుపై కూడా ఉండకూడదని తేల్చిచెప్పింది. హరిజన్ అనే పదం అసంబద్ధంగా, ఒక వర్గాన్ని కించపరిచేటట్టు ఉందని .. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.

నో నో ..

నో నో ..

పాఠశాల అడ్రస్ ముందు హరిజన్ అనే పదం పలుకకూడదని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఆదేశాలతో రాజస్థాన్ విద్యాశాఖ ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. అక్టోబర్ 2న గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని అలా పిలువొద్దని డిషిసన్ తీసుకున్నట్టు తెలిపింది. ఇకపై స్కూల్ పరిసరాల్లో, బోర్డుల మీద హరిజన్ అనే పదం కనిపించొద్దని రాజస్థాన్ సెకండరీ విద్యాశాఖ డైరెక్టర్ నాథమల్ డిడెల్ పేర్కొన్నారు.

మూడురోజుల గడువు

మూడురోజుల గడువు

దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా ముఖ్య విద్యాధికారి, జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్స్ ఆఫ్ సమగ్ర శిక్ష అభియాన్‌కు ఆదేశాలు జారీచేసినట్టు పేర్కొన్నారు. ఆయా పాఠశాలలకు మూడురోజుల సమయం ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ లోగా పేరు మీద, ఇతర రికార్డుల్లో ఉన్న హరిజన్ అనే పదాన్ని తీసివేయాలని స్పస్టంచేశారు. కొన్ని పాఠశాలలు, సంస్థలు ఇప్పటికీ హరిజన్ అనే పదం వాడుతున్నారని ఒక అధికారి మీడియా దృష్టికితీసుకొచ్చారు.

పలికింది ఆయనే ..

పలికింది ఆయనే ..

హరిజన్ అనే పదం అసంబద్ధంగా .. కించపరిచేలా ఉందని రాజస్థాన్ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో అన్ని పాఠశాలల్లో హరిజన్ అనే పదం ఉన్నందున .. తీసేయాలని డిసిషన్ తీసుకున్నట్టు వెల్లడించారు. పేరు, చిరుమానాలో ఆ పదం వాడటం ఆయా వర్గాలను కించపరచడమేనని పేర్కొన్నారు. అయితే 1932లో దళితులు అనే పదానికి బదులు హరిజన్ అని మహాత్మా గాంధీ ఉచ్చరించడం విశేషం. హరిజన్ అంటే దేవుని పిల్లలు అని అర్థం. కానీ పరిణామా క్రమంలో అదీ అసంబద్ధ పదమైపోయింది. 2017లో సుప్రీంకోర్టు కూడా హరిజన్ అనే పదం అసంబద్ధమైనదని పేర్కొనడం విశేషం.

English summary
Rajasthan’s education department has ordered government schools to remove the word ‘Harijan’ from their addresses, saying the use of the word is “unconstitutional”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X