వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం కీలక నిర్ణయం : మోదీ సహా కేంద్రమంత్రులంతా ఖర్చులు తగ్గించుకోవాలని.. ఎందుకంటే?

|
Google Oneindia TeluguNews

దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం,ద్రవ్య లోటు కారణంగా ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీతో సహా కేంద్రమంత్రులంతా తమ ప్రయాణ,ఆహార,సమావేశ ఖర్చులను తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడులు,ఆర్థిక వృద్దికి సంబంధించి ఇటీవల మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేబినెట్ నిర్ణయం మేరకు కేంద్రమంత్రులంతా ఇకపై అనవసర ఖర్చులను తగ్గించుకోనున్నారు. ప్రయాణ,ఆహార,సమావేశాలకు సంబంధించి 20శాతం వరకు ఖర్చును తగ్గించుకోనున్నారు. దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సీసీఐజీ(కేబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్&గ్రోత్) సంబంధిత ఖర్చుల విభాగానికి ఆదేశాలు జారీ చేసింది.

 ఎందుకీ నిర్ణయం

ఎందుకీ నిర్ణయం

తదుపరి చర్యల కోసం సంబంధిత మంత్రిత్వ శాఖలకు గత వారం సీసీఐజీ సమావేశం యొక్క వివరాలను పంపించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ద్రవ్యలోటును 3.3 శాతం వద్దనే నియంత్రించేందుకు అభివృద్ధియేతర వ్యయాలను తగ్గించుకోవాలని.. కేంద్రం చేసిన ప్రయత్నంగా ఈ చర్యను చూస్తున్నారు. గత 11 ఏళ్లలో మునుపెన్నడూ లేనంతగా జీడీపీ వృద్ది రేటు 5శాతం కంటే తక్కువకు పడిపోవడంతో.. ద్రవ్య లోటును నియంత్రించడం ప్రభుత్వం సవాల్‌గా తీసుకుంటోంది.

 గతంలోనూ ఇలాంటి నిర్ణయం

గతంలోనూ ఇలాంటి నిర్ణయం

ప్రభుత్వం ఇలా ఖర్చులను తగ్గించుకోవడం ఇదే మొదటిసారేమీ కాదు. అక్టోబర్,2014లోనూ కేంద్ర ఖర్చుల విభాగం ఆయా మంత్రిత్వ శాఖలను 10శాతం ఖర్చులు తగ్గించుకోవాల్సిందిగా ఆదేశించింది. ఎగ్జిబిషన్లు, ఉత్సవాలు, సెమినార్లు మరియు సమావేశాల నిర్వహణలో ఆర్థిక స్థితి గతులను గమనించి ఖర్చు చేయాలని, అలాగే వాహనాల కొనుగోలు మరియు దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాల ఖర్చు తగ్గించుకోవాలని అప్పట్లో సూచించింది.

 ఆర్థిక క్రమశిక్షణ కోసమే

ఆర్థిక క్రమశిక్షణ కోసమే

ప్రభుత్వ కార్యాచరణ సామర్థ్యాన్ని పరిమితం చేయడం ఈ చర్యల ఉద్దేశం కాదని, ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడానికే అని ఖర్చుల విభాగానికి సంబంధించిన సెక్రటరీ అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, ఖర్చులను హేతుబద్ధీకరించడం మరియు సాధ్యమైనంత మేర అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అందులో తెలిపారు.

సీసీఐజీ ఎప్పుడు ఏర్పాటైంది..

సీసీఐజీ ఎప్పుడు ఏర్పాటైంది..

గతేడాది జూన్‌లో ఏర్పాటు చేసిన సీసీఐజీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,హోంమంత్రి అమిత్ షా,రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ,ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్,రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ సభ్యులుగా ఉన్నారు. డిసెంబర్ చివరివారం,2019లో ఈ కమిటీ తొలి సమావేశం జరిగింది. విదేశీ పెట్టుబడుల విధి విధానాలు,ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించి ప్రధాని మోదీ ప్రకటించిన రూ.100లక్షల కోట్ల ప్రాజెక్టుపై ఈ సమావేశ సమీక్ష నిర్వహించారు.

English summary
All ministries have been directed to reduce wasteful expenditure on travel, food and conferences by 20 percent. The CCIG has asked the Department of Expenditure, Ministry of Finance, to take necessary action in this regard
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X