• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేరళ శబరిమలలోనే ఎందుకలా..చర్చీల్లో ఎందుకిలా..?

|

శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకున్న నేపథ్యంలో తమకు కూడా పోలీసులు అలాంటి భద్రతే కల్పించాలని మలంకారా ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ డిమాండ్ చేసింది. గత కొన్ని రోజులుగా జాకోబైట్ సిరియన్ చర్చి మలంకార ఆర్థోడాక్స్ సిరియన్ చర్చిల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఈ రెండు చర్చీల మధ్య గొడవలు కూడా జరిగాయి.

"శబరిమల పూజలకు సంబంధించిన అంశం. దీనిపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయం. అదే సమయంలో మహిళలు ఆలయంలోకి ప్రవేశించడాన్ని తప్పుపట్టడంలేదు. సుప్రీం కోర్టు ఆర్డరును అమలు చేసిన పోలీసులు అదే ఆదేశాలను చర్చిలకు ఎందుకు వర్తింపజేయడం లేదు" అని ప్రశ్నించారు మలాంకారా ఆర్థోడాక్స్ సిరియన్ చర్చి అధికార ప్రతినిధి ఫాదర్ జాన్ అబ్రహాం కోనత్.

"మహిళలు అయ్యప్ప దర్శనానికి పోలీసుల సహకారం కోరిఉండొచ్చు. దానికి సాక్ష్యం లేదు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే మహిళలను ఆలయంలోకి ప్రవేశింపజేశారనైతే మేము అనుకోవడం లేదు. ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని కాపాడేందుకు ప్రభుత్వం శ్రమిస్తోంది.అది ప్రభుత్వం బాధ్యత కూడా. " అని చెప్పారు జాకోబైట్ చర్చి అధికార ప్రతినిధి కురియాకోస్ మార్ థియోఫోలిస్.

Govt should adopt same stand in Church dispute demands kerala church priests

మలంకారీ చర్చీలో మెజార్టీ సభ్యులు ఆర్థోడాక్స్ విభాగంకు చెందిన వారుండగా... వారికంటే తక్కువ సంఖ్యలో జాకోబైట్ సంఘం వారున్నారు. ఆర్థోడాక్స్ చర్చి హెడ్ క్వార్టర్స్ కొట్టాయంలో ఉంది. ఈ మధ్యనే పరివోం మరియు కొత్తమంగళంలో చర్చి అధికారాల విషయంలో రెండు వర్గాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అంతేకాదు రెండు వర్గాల వారు భౌతికంగా దాడులు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే చర్చి అధికారాలు ఆర్థోడక్స్ వర్గానికే చెందుతాయని సుప్రీం కోర్టు తీర్పు చెప్పడంతో తీర్పుకు వ్యతిరేకంగా జాకోబైట్ వర్గానికి చెందిన వారు భారీ నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆర్థోడాక్స్‌ వర్గానికి చెందిన చర్చి ఫాదర్లు చర్చీలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం కూడా జరిగింది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితిపై న్యాయపరమైన పరిష్కారం రావాలని తాము కోరుకుంటున్నట్లు కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ డిమాండ్ చేస్తోంది. ఇద్దరు మహిళలు కొండపై అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారనే అంశం రాజకీయ రంగు పులుముకుంటోందని...పరిస్థితి చేయిదాటకముందే న్యాయస్థానం కల్పించుకుని ఒక పరిష్కార మార్గం కనుగొనాలని కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ అధికార ప్రతినిధి ఫాధర్ వర్గీస్ వల్లిక్కట్ కోరారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As two women made history by entering sabarimala shrine with police protection following the apex court order, Malankara Orthodox Syrian Church has demanded that the government should adopt the same stand in handling the dispute between the church and Jacobite Syrian Church in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more