వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫీసులకు బికినీలు వేసుకొచ్చినా అనుమతించండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

పనాజీ: సాంస్కృతిక శాఖ సిబ్బందికి డ్రెస్ కోడ్ అంటూ గోవా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యుడు అలెక్సియో రెజినాల్డో లౌరెంకో తీవ్రంగా స్పందించారు. అంతేగాక, వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు.

ఉద్యోగులు వారికి ఇష్టమైన దుస్తులతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేందుకు వెసులుబాటు కల్పించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా, ఉద్యోగులు వారికిష్టమైన బికినీలు ధరించి వచ్చినా వారిని అనుమతించాల్సిందేనని అన్నారు.

Govt should allow staff to wear bikinis to office: Congress legislator, Goa

గోవా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో గురువారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, సాంస్కృతిక శాఖలో పని చేసే అధికారులు, సిబ్బంది కూడా స్లీవ్ లెస్ టాప్స్, జీన్స్, కోర్దురాయ్స్, టీ షర్ట్స్, ఎక్కువగా జేబులుండే ట్రౌజర్లను ధరించరాదని గోవా ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాలపై మండిపడిన కాంగ్రెస్ సభ్యుడు రెజినాల్డో.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తోందని ఆరోపించారు. రెజినాల్డో వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. తర్వాత మాట్లాడతామని సాంస్కృతిక శాఖ మంత్రి దయానంద్ మంద్రేకర్ దాటవేశారు.

English summary
Taking a dig at a dress code order issued by the BJP government in Goa, Congress legislator Alexio Reginaldo Lourenco has said that 'bikinis should be allowed in overnment offices".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X