వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకరిని చంపితే ముగ్గురిని మట్టుబెట్టాలి, సైన్యానికి ఆదేశాలివ్వండి, కేంద్రానికి అమరీందర్ సింగ్ సూచన

|
Google Oneindia TeluguNews

భారత్‌తో చైనా ఘర్షణపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఒకడుగు ముందేసిన పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. చైనాకు ధీటుగా ప్రతీ దాడి చేయాలని కోరారు. అంతేకాదు ఒక సైనికుడిని చంపితే.. ముగ్గురు ప్రత్యర్థులను మట్టుబెట్టాలని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ 1963-1966 మధ్య ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. చైనా జవాన్ల చేతికి కమాండర్ ఉన్న సమయంలో.. మిగతా వారు ఎందుకు కాల్పులు జరపలేదు అని ప్రశ్నించారు.

భారతీయుడి మాట

భారతీయుడి మాట


ఒక రాజకీయ నాయకుడిలా ఈ సలహా ఇవ్వడం లేదు అని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. ఓ భారతీయుడిగా మాట్లాడుతున్నానని చెప్పారు. ఇప్పుడే కాదు ఇదివరకు పుల్వామాలో దాడి సమయంలో కూడా అలాగే అమరీందర్ సింగ్ స్పందించారు. మన సైనికులను ఒకరిని చంపితే.. ఇద్దరిని మట్టుబెట్టాలని కోరారు. అంతేకాదు జవాన్లపై దాడి చేస్తున్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీపై కాల్పులు జరిపేందుకు వారికి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. ఆర్డర్స్ ఇవ్వడంలో ఎక్కడో లోపం జరిగింది అని కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా మండిపడ్డారు.

సెకండ్ కమాండెంట్

సెకండ్ కమాండెంట్


గాల్వాన్‌లో కొందరు జవాన్లు ఉంటే సెకండ్ కమాండెంట్ కాల్పులు జరిపేందుకు ఎందుకు నిరాకరించారు అని అమరీందర్ సింగ్ ప్రశ్నించారు. తోటి సైనికులపై దమనకాండకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకున్నారా అని ప్రశ్నించారు. అసలు ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది అని ప్రశ్నించారు. నేనే కాదు.. ప్రతీ భారతీయడు, సైనికుడు జరిగిన ఘటన గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాడని చెప్పారు.

Recommended Video

YS Jagan ఫోటో పెట్టుకుని మళ్లీ గెలవండి రా చూస్తాను - Raghu Rama Krishnam Raju
60 ఏళ్ల దౌత్యం విఫలం

60 ఏళ్ల దౌత్యం విఫలం


20 మందిని దారుణంగా రాళ్లతో దాడిచేసి హతమార్చారని పేర్కొన్నారు.60 ఏళ్ల దౌత్యం పనిచేయలేదు, చైనా అగ్రదేశం అయితే, భారత్ కూడా అందుకు సమానమే అని పేర్కొన్నారు. ఇప్పుడు కాదు 1962 నుంచి చైనా ఆక్రమణలు చేస్తూనే ఉన్నారని అమరీందర్ తెలిపారు.

English summary
nation was expecting a befitting response from the government to this horrific attack on its men, CM Amarinder Singh said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X