వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో చిక్కుకున్న విదేశీయుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే దేశం లాక్‌డైన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రజలంతా తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వాహనాలు లేక ఇబ్బందులు పడిన విషయం చూశాము. ఇక విమానాలు రద్దు కావడంతో దేశ నలుమూలలా విదేశీయులు చిక్కుకుపోయారు. కొందరిని కేంద్రం గుర్తించి కొద్దిరోజుల క్రితం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వారిని తమ సొంత దేశాలకు చేర్చడంలో చర్యలు తీసుకుంది. ఇంకా ఎవరైనా విదేశీయులు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే వారి వివరాల కోసం కేంద్ర పర్యాటక శాఖ ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది.

స్ట్రాండెడ్ ఇన్ ఇండియా పేరుతో ఈ వెబ్‌సైట్ కేవలం విదేశీయుల కోసమే రూపొందించింది పర్యాటక శాఖ. ఈ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను పొందుపర్చింది. ఈ కష్ట సమయాల్లో పర్యాటక శాఖ మీకు అండగా నిలుస్తోందని పేర్కొంది. దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులను తమ సొంత దేశాలకు తరలించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుందంటూ భరోసా కల్పించింది. ఒకవేళ విదేశాల నుంచి భారత్‌కు వచ్చి ఈ కష్ట సమయాల్లో ఎక్కడైనా చిక్కుకుని ఉంటే సంబంధిత అధికారులతో టచ్‌లోకి వచ్చేందుకు కేంద్ర పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలనేదే తమ ప్రథమ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

Govt starts a new website for foreign travellers stranded in India

దేశంలో చిక్కుకుపోయిన విదేశీయుల కోసం http://strandedinindia.com/ అనే ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి పూర్తి వివరాలు తెలిపితే సంబంధిత అధికారులు స్పందించి సహాయం చేస్తారని పేర్కొంది. ఈ వెబ్‌సైట్‌లో కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేసింది.

కోవిడ్-19 హెల్ప్‌లైన్ నెంబరు : +91-11-23978046 లేదా 1075
హెల్ప్ లైన్ ఈమెయిల్ ఐడీ: [email protected]
[email protected]

వాట్సాప్ నెంబర్ (భారత ప్రభుత్వ కోవిడ్-19 హెల్ప్ డెస్క్): +91 9013151515

బీఓఐ హెల్ప్ లైన్: [email protected]
011-24300666

టూరిస్టు హెల్ప్ లైన్: 1363 లేదా 1800 11 1363

ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఈ వెబ్‌సైట్‌కు లాగిన్ అయితే చాలు: http://strandedinindia.com/

English summary
Indian Govt had launched a new portal for the foreigners who got stranded in India due to covid-19 pandemic. Foreign nationals can fill in their details so that concerned authorities would help said govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X