వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషం కలిపిన స్వీట్లు ఇవ్వడం లాంటిదే... మా చుట్టూ వల పన్నే కుట్ర.. : కేంద్రంపై రైతు సంఘాల నేతలు

|
Google Oneindia TeluguNews

ఇప్పటికీ 10 దఫాలుగా చర్చలు జరిగాయి... ఇవాళ 11 రౌండ్ చర్చలు జరగబోతున్నాయి... తాజా సమావేశంలోనైనా కేంద్ర ప్రభుత్వానికి,రైతు సంఘాలకు మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏడాదిన్నర పాటు అగ్రి చట్టాలను పక్కనపెట్టేందుకు కేంద్రం ముందుకొచ్చినప్పటికీ... వాటిని రద్దు చేయాలన్నదే తమ ఏకైక ఎజెండా అని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా పక్కనపెట్టడం ద్వారా చర్చల కోసం తాము ఓ మెట్టు దిగి వచ్చామన్న సంకేతాలు కేంద్రం పంపించినప్పటికీ... ఇదంతా రైతులను మోసం చేసే కుట్రలో భాగమేనని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

రైతు ఆందోళనలపై రాహుల్ కీలక వ్యాఖ్యలు... చంపారన్ ఉద్యమంతో పోల్చిన నేత... రైతు ఆందోళనలపై రాహుల్ కీలక వ్యాఖ్యలు... చంపారన్ ఉద్యమంతో పోల్చిన నేత...

విషం కలిపిన స్వీట్లు ఇవ్వడం లాంటిదే...

విషం కలిపిన స్వీట్లు ఇవ్వడం లాంటిదే...


శుక్రవారం(జనవరి 22) కేంద్రంతో జరపబోయే చర్చల కోసం రైతులు ఇప్పటికే ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేత ఎస్ఎస్ పంధేర్... కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా తమ చుట్టూ ఒక వల పన్నేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ఒకరకంగా ఇది విషం కలిపిన స్వీట్లను తమకివ్వడం లాంటిదేనని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆశించేదేమీ లేదు... అర్థం చేసుకోవాలంటున్నాం...

ఆశించేదేమీ లేదు... అర్థం చేసుకోవాలంటున్నాం...

'ఏదైనా చేయాలి... మొత్తం మీద రైతుల ఆందోళనలకు తెరదించాలి అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది. వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా పక్కనపెట్టాలన్న కేంద్రం డిమాండును మేము ముక్తకంఠంతో తిరస్కరించాం. ఈరోజు సమావేశంలోనూ ఆ చట్టాల రద్దు గురించే డిమాండ్ చేస్తాం. కనీస మద్దతు ధర గురించి చర్చిస్తాం.' కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేత తెలిపారు. ఆల్ ఇండియా కిసాన్ సభ జనరల్ సెక్రటరీ హన్నన్ మొల్లా మాట్లాడుతూ... 'కేంద్రం నుంచి రైతులు పెద్దగా ఏమీ ఆశించట్లేదు. కేవలం వాళ్ల ఆందోళనను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.' అని పేర్కొన్నారు. జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ జరిగి తీరుతుందని... వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు.

ఇప్పుడైనా కొలిక్కి వచ్చేనా...

ఇప్పుడైనా కొలిక్కి వచ్చేనా...

దాదాపు గత రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. అయితే కేంద్రం మాత్రం.. కావాలంటే ఆ చట్టాలకు సవరణలు చేస్తామని,రద్దు చేయడం కుదరదని మొదట రైతు సంఘాలతో చెప్పింది. అందుకు రైతు సంఘాలు ససేమిరా అనడంతో ఆ చట్టాలను ఏడాదిన్నర పాటు పక్కనపెట్టేస్తామని కేంద్రం తాజాగా ప్రకటించింది. అయినప్పటికీ రైతులు ఆ ప్రతిపాదనను విశ్వసించట్లేదు. ఏం చేసైనా సరే తమ ఆందోళనలను విరమింపజేయాలన్న ఉద్దేశమే తప్ప సమస్య పరిష్కారం పట్ల కేంద్రం చిత్తశుద్దిగా వ్యవహరించట్లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న 11వ దఫా చర్చలైనా సఫలమవుతాయా లేక పాత సీనే రిపీట్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది.

English summary
Farmers' leaders reached Vigyan Bhawan in New Delhi to hold the 11th round of talks with the Central government over the three contentious farm laws. The meeting is now underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X