వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

100 శాతం ఎయిర్ ఇండియా వాటా విక్రయం, గతంలో 76 శాతం బిడ్లకు స్పందన కరవు, మరి ఈసారి...

|
Google Oneindia TeluguNews

నష్టాలను మూటగట్టుకొంటున్న ఎయిర్ ఇండియా మొత్తం వాటాలను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లకు సంబంధించి రెండింటీలో 100 శాతం వాటాలను విక్రయిస్తామని ప్రకటించింది. ఎయిర్ ఇండియా వాటాల విక్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.

ఎయిర్ ఇండియా: విలువైన ఆస్తులను కూడా వదల్లేదు, వాటాల విక్రయంపై కపిల్ సిబాల్ ఎయిర్ ఇండియా: విలువైన ఆస్తులను కూడా వదల్లేదు, వాటాల విక్రయంపై కపిల్ సిబాల్

ఎయిర్ ఇండియాలో వ్యుహాత్మక పెట్టుబుడులు పెట్టేందుకు బిడ్లకు స్వాగతం చెప్పింది. దీంతో యాజమాన్య నియంత్రణ, ఈక్విటి షేర్లు కూడా కొత్త యాజమాన్యంలోకి వెళతాయని పేర్కొన్నది. బిడ్లు దాఖలు చేసేందుకు ఆయా సంస్థలకు మార్చి 17వ తేదీ వరకు గడువు విధించింది. బిడ్లు దక్కించుకున్న సంస్థ బాధ్యతలు స్వీకరించి 3.26 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. అయితే 2018లో 76 శాతం బిడ్లకు పిలిచినా ఒక్క సంస్థ ముందుకురాని సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి మొత్తం వాటా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Govt to Sell 100% Stake in Air India in Fresh Hunt for Bids

ఎయిర్ ఇండియా వాటాను విక్రయించిన తర్వాత కొత్త యాజమాన్య పరిధిలోకి సంస్థ వెళుతోంది. కానీ కీలక నిర్ణయాలు మాత్రం ప్రభుత్వ అనుమతితోనే చేపట్టాల్సి ఉంటుంది. దేశీయ సంస్థలకు బిడ్ దాఖలు చేయడంలో ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. విదేశీ కంపెనీలకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చింది.

ప్రిలిమినరీ బిడ్లను ఎవరు సొంతం చేసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఎయిర్ ఇండియాను చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్, హిందూజా, ఇండిగో, స్పైస్ జెట్ సహా కొన్ని ప్రైవేట్ ఈక్విటి సంస్థలు పోటీ పడొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

English summary
government on Monday announced plans to sell its entire stake in Air India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X